T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్‌ సింగ్‌ | ARSHDEEP SINGH BECOMES THE MOST WICKETS FOR INDIA IN T20 WORLD CUP HISTORY | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్‌ సింగ్‌

Feb 27 2026 10:19 AM | Updated on Feb 27 2026 10:22 AM

ARSHDEEP SINGH BECOMES THE MOST WICKETS FOR INDIA IN T20 WORLD CUP HISTORY

ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్‌-2026లో టీమిండియా లెఫ్డ్‌ అర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అర్షదీప్‌.. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా రికార్డును అధిగమించాడు. 

అర్షదీప్‌ తన టీ20 వరల్డ్‌కప్‌ కెరీర్‌లో 19 మ్యాచ్‌ల్లో 14.25 సగటున, 7.33 ఎకానమీతో 35 వికెట్లు తీయగా.. బుమ్రా తన 19 మ్యాచ్‌ల వరల్డ్‌కప్‌ కెరీర్‌లో 14.00 సగటున 33 వికెట్లు తీశాడు. 

ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు (50) దక్కుతుంది.

సూపర్‌ ఫామ్‌లో అర్షదీప్‌
ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్షదీప్‌ సింగ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. టీమిండియా గత ఎడిషన్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించడంలోనూ అర్షదీప్‌సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. ఆ ఎడిషన్‌లో 17 వికెట్లు తీసి జాయింట్‌ హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 81 టీ20లు ఆడిన అర్షీదప్‌.. 126 వికెట్లు తీసి భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో అర్షదీప్‌ సహా జట్టులోని ప్రతి ఒక్కరు సత్తా చాటడంతో జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌ భారత్‌కు డూ ఆర్‌ డై మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా, మ్యాచ్‌ రద్దైనా విండీస్‌కే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది.

భారత్‌ వర్సెస్‌ జింబాబ్వే స్కోర్‌ వివరాలు..
భారత్‌: 256-4 (అభిషేక్‌ (55), హార్దిక్‌ (50 నాటౌట్‌)
జింబాబ్వే: 184-6 (బ్రియాన్‌ బెన్నెట్‌ 97 నాటౌట్‌, అర్షదీప్‌ 4-0-24-3) 

Advertisement
 
Advertisement
Advertisement