జింబాబ్వే చిత్తు.. టీమిండియా సెమీస్ ఆశ‌లు స‌జీవం | Bennett 97 in vain as India beat Zimbabwe by 72 runs | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జింబాబ్వే చిత్తు.. టీమిండియా సెమీస్ ఆశ‌లు స‌జీవం

Feb 26 2026 10:40 PM | Updated on Feb 27 2026 10:22 AM

Bennett 97 in vain as India beat Zimbabwe by 72 runs

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా తమ సెమీస్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. జింబాబ్వేను 72 ప‌రుగుల తేడాతో సూర్య సేన చిత్తు చేసింది. ఈ కీల‌క పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 256 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఇండియా బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిల‌క్ వ‌ర్మ‌(16 బంతుల్లో 44), ఇషాన్ కిష‌న్(38), సూర్య‌కుమార్ యాద‌వ్‌(33), సంజూ శాంస‌న్‌(24) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

బెన్నెట్ ఒంట‌రి పోరాటం..
255 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ రియాన్ బెన్నెట్ ఒంట‌రి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 97 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ సికింద‌ర్ ర‌జా(31) ఫ‌ర్వాలేద‌న్పించాడు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement