టీ20 వరల్డ్‌కప్-2026లో జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన బ్యాటర్లు జూలు విధిల్చారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు.
బ్యాటింగ్‌కు ప్రతీ ఒక్కరూ పరుగులు సాధించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు.
అయితే మొత్తం ఆరుగురు బ్యాటర్లు కూడా 150+ స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడం విశేషం. తద్వారా టీమిండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేయడం ఇదే తొలిసారి.
👉ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో భారత్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో టీమిండియా ఇప్పటివరకు 63 సిక్సర్లు కొట్టింది. వెస్టిండీస్ 66 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది.
👉టీ20 వరల్డ్‌కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ బంతులు(26) డాట్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది.


