టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో శాంసన్‌కు తుది జట్టులో దక్కింది.
టీమ్ మెనెజ్‌మెంట్ అతడిని ఓపెనర్‌గా పంపింది. అయితే సంజూ క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్‌లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే భారత స్కోరు బోర్డు ఖాతాను సంజూ భారీ సిక్సర్‌తో తెరిచాడు.
ఇన్నింగ్స్ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా శాంసన్ ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్‌కు మైదానంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ షాట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు.
ఈ షాట్ 2022 టీ20 ప్రపంచకప్‌లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్ సిక్సర్‌ను గుర్తుకు తెచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀
Sanju Samson starts the innings on a positive note! 💪
ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026


