క‌ర్ణాట‌క‌కు చుక్క‌లు చూపిస్తున్న జ‌మ్మూ అండ్ కాశ్మీర్‌ | Ranji Trophy Final Day 3: Karnataka trail by 364 runs | Sakshi
Sakshi News home page

Ranji Trophy Final: క‌ర్ణాట‌క‌కు చుక్క‌లు చూపిస్తున్న జ‌మ్మూ అండ్ కాశ్మీర్‌

Feb 26 2026 6:20 PM | Updated on Feb 26 2026 6:22 PM

Ranji Trophy Final Day 3: Karnataka trail by 364 runs

హుబ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైన‌ల్లో కర్ణాటకపై  జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి క‌ర్ణాట‌క త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది.

మయాంక్ అగ‌ర్వాల్‌(130 బ్యాటింగ్‌) సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. మిగితా బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్ దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ 11 ప‌రుగులు చేయ‌గా.. సీనియ‌ర్ బ్యాట‌ర్లు స్మరన్ రవిచంద్రన్, క‌రుణ్ నాయ‌ర్ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియన్‌కు చేరారు. 

జ‌మ్మూ కాశ్మీర్ బౌలర్ల‌లో అకిబ్ నబీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. యుద్ద్‌వీర్ సింగ్, సునీల్ కుమార్ త‌లా వికెట్ సాధించారు. ప్ర‌స్తుతం క్రీజులో అగ‌ర్వాల్‌తో పాటు కృతిక్ కృష్ణ(27) ఉన్నారు. క‌ర్ణాట‌క ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో జ‌మ్మూ కంటే 364 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది.

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన జ‌మ్మూ అండ్ కాశ్మీర్ 584 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. జ‌మ్మూ బ్యాట‌ర్ల‌లో దాదాపు ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం విశేషం. శుభమ్ పుందిర్ 121 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. యావర్ హసన్(88), పారస్ డోగ్రా(70), కన్హయ్య వధావన్( 70 పరుగులు) రాణించారు. ఒక‌వేళ ఈ మ్యాచ్ డ్రా అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు అయితే  ఎక్కువ పరుగులు సాధిస్తుందో వారికే టైటిల్ దక్కుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement