breaking news
Ranji Trophy 2025-26
-
చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్
ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని భారత సెలెక్టర్లకు వెటరన్ పేసర్, బెంగాల్ ఆటగాడు మహ్మద్ షమీ (Mohammed Shami) దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ఇవాళ (అక్టోబర్ 15) ప్రారంభమైన రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) ఉత్తరాఖండ్‌పై 4 బంతుల్లో 3 వికెట్లు తీసి టీమిండియాకు అడేందుకు 100 శాతం అర్హుడినన్న సందేశం పంపాడు.షమీ తీసిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్‌లు కాగా.. మరొకటి క్యాచ్ ఔట్. షమీతో పాటు ఇషాన్ పోరెల్ (15-3-40-3), సూరజ్ సింధు జైస్వాల్ (19-4-54-4) చెలరేగడంతో ఉత్తరాఖండ్ 72.5 ఓవర్లలో 213 పరుగులకే చాపచుట్టేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో భుపేన్ లాల్వాని (71) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో కనీసం ఒక్కరూ 30 పరుగుల మార్కును తాకలేకపోయారు.ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా షమీని భారత సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఊహలకందని రీతిలో రాణించిన షమీ.. గాయం కారణంగా ఏడాదికాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడిన షమీ.. ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి, దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. అతను చివరిగా 2023 జూన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకైనా ఎంపిక చేస్తారని షమీ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సెలెక్టర్లు ఈసారి కూడా పట్టించుకోలేదు. తాజాగా అతను ఆసీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు.ఫిట్నెస్ సాకుగా చూపిస్తూ నన్ను పక్కకు పెట్టారు. ఫిట్నెస్ లేకపోతే రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానన్న అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు. సెలెక్లరు, కోచ్, కెప్టెన్ అనుకుంటేనే తాను జట్టులో ఉంటానని అన్నాడు. ఈ వాఖ్యలు చేసిన తర్వాత షమీ బంతితోనే సెలెక్టర్లను సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. మున్ముందైనా సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.చదవండి: శతక్కొట్టిన ఇషాన్ కిషన్ -
శతక్కొట్టిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) భాగంగా తమిళనాడుతో ఇవాళ (అక్టోబర్ 15) మొదలైన మ్యాచ్‌లో జార్ఖండ్ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కూడా అయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.75 ఓవర్ల తర్వాత జార్ఖండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 251 పరుగులుగా ఉంది. ఇషాన్‌కు జతగా సాహిల్ రాజ్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో శిఖర్ మోహన్ 10, శరన్‌దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3, డీటీ చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 16 మ్యాచ్‌లు జరుగతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇషాన్ కిషన్‌దే మొదటి శతకం. వేర్వేరు మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal), రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచరీలకు చేరువై ఔటాయ్యరు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ (కర్ణాటక) 96 పరుగుల వద్ద ఔటాయ్యడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ (మహారాష్ట్ర) 9 పరుగుల తేడాతో అత్యంత అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు (18/5) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా మాజీ వికెట్కీపర్ఉత్తర్ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్ (Srikar bharat) (ఆంధ్రప్రదేశ్) సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షేక్ రషీద్ (69) క్రీజ్‌లో ఉన్నాడు. 73 ఓవర్ల తర్వాత ఆంధ్ర స్కోర్ 235/1గా ఉంది.చదవండి: దుమ్మురేపిన రషీద్ ఖాన్ -
పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్‌దీ అదే దారి
రంజీ ట్రోఫీ తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనే మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)కు చేదు అనుభవం ఎదురైంది. కేరళతో బుధవారం మొదలైన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ.. పరుగుల ఖాతా తెరవకుండానే నిధీశ్ (Nidheesh) బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.మహారాష్ట్ర Vs కేరళ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 91వ ఎడిషన్‌కు బుధవారం తెరలేచింది. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలోని మహారాష్ట్ర- కేరళ మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్‌దీ అదే దారిఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఊహించని రీతిలో వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యాడు. అర్షిన్ బాసిల్ బౌలింగ్‌లో కణ్ణుమ్మల్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ గోల్డెన్ డకౌట్ కాగా.. సిద్ధేశ్.. నిధీశ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అజారుద్దీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఖాతా తెరిచిన రుతువీరితో పాటు కెప్టెన్ అంకిత్ బావ్నే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అయితే, ఏడు బంతుల పాటు క్రీజులో నిలిచిన అతడు బాసిల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి రుతు 28 బంతుల్లో ఒక పరుగు చేయగా.. సౌరభ్ నవాలే 20 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మొత్తానికి తొలిరోజు పది ఓవర్ల ఆటలో కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 16 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరుస సెంచరీల తర్వాతకాగా కెరీర్ ఆరంభం నుంచి ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఈ ఏడాది మహారాష్ట్రకు మారాడు. ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ రెడ్‌బాల్ టోర్నీలో, ముంబైతో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీలతో అలరించిన పృథ్వీ.. అసలైన పోరులో మాత్రం ఆదిలోనే తుస్సుమనిపించాడు.రంజీ ట్రోఫీ-2025: మహారాష్ట్ర వర్సెస్ కేరళ తుదిజట్లుమహారాష్ట్రఅంకిత్ బావ్నే (కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, రజనీశ్ గుర్బానీ, విక్కీ ఓస్త్వాల్, సిద్ధేష్ వీర్, ముఖేష్ చౌదరి, అర్షిన్ కులకర్ణి, రామకృష్ణ ఘోష్.కేరళమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాబా అపరాజిత్, సంజూ శాంసన్, సచిన్ బేబీ, ఎండీ నిధీశ్, అక్షయ్ చంద్రన్, రోహన్ కుణ్ణుమ్మల్, అంకిత్ శర్మ, ఈడెన్ యాపిల్ టామ్, నెడుమాన్కులి బాసిల్, సల్మాన్ నిజార్.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ