
భారత వన్డే జెర్సీలో వైభవ్(పాత ఫోటో)
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బిహార్ వైస్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూపులో భాగంగా పాట్నా వేదికగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అరుణాచాల్ కెప్టెన్ తొలుత బిహార్‌ను బ్యాటింగ్ అహ్హనించాడు.
అయితే బ్యాటింగ్‌కు దిగిన బిహార్ ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టీ20 తరహాలో తన బ్యాటింగ్‌ను ప్రారంభించిన వైభవ్ కేవలం 5 బంతుల్లో 280.00 స్ట్రైక్ రేటుతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు.
బిహార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన యాబ్ నియా బౌలింగ్‌లో తొలి నాలుగు బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదిన వైభవ్.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
"వైభవ్ ఫార్మాట్ తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతీ బంతికి షాట్ ఆడే అవసరం లేదు. ఇది రెడ్ బాల్ క్రికెట్. సహనం, టెక్నిక్ కూడా కావాలి" ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
కాగా 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్‌లలో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే అతడికి బిహార్ క్రికెట్ అసోయేషిన్ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది.
అతడి బిహార్ జట్టును అత్యున్నత స్ధాయికి తీసుకు వెళ్తాడని బీసీఎ భావించింది. కానీ వైభవ్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే విఫలమై నిరాశపరిచాడు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా సూర్యవంశీ తన బ్యాట్‌కు పని చెబుతాడో లేదో చూడాలి.
భారీ స్కోర్ దిశగా బిహార్..
సూర్యవంశీ నిరాశపరిచినప్పటికి తొలి ఇన్నింగ్స్‌లో బిహార్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బిహార్ రెండు వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో ఆయుష్ లోహరుక(155), సకిబుల్ గని(56) ఉన్నారు.
చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ