
రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు మెరుగైన రీతిలో మొదలు పెట్టింది. కాన్పూర్ వేదికగా గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 85.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
వికెట్ కీపర్ కేెఎస్ భరత్ (244 బంతుల్లో 142; 13 ఫోర్లు) భారీ శతకంతో చెలరేగాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. భరత్ మరో యువ ఆటగాడు షేక్ రషీద్‌తో కలిసి మూడో వికెట్‌కు 194 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
రషీద్ కూడా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి రషీద్ 197 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ అభిషేర్ రెడ్డి(36) పర్వాలేదన్పించగా.. కెప్టెన్ రికీ భుయ్(2) మాత్రం విఫలమయ్యాడు. యూపీ బౌలర్లలో ఆఖిబ్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కగా, విప్‌రాజ్ నిగమ్ మరో వికెట్ తీశాడు.
గోల్డెన్ ఛాన్స్ మిస్..
కేఎస్ భరత్ టీమిండియా తరపున 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ విశాఖ కుర్రాడు సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ గాయ పడడంతో గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భరత్‌కు ఆడే అవకాశం లభించింది.
కానీ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన మార్క్ చూపించలేకపోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. పంత్‌కు ప్రత్నమ్నాయంగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. జురెల్ తన అద్భుతమైన ప్రదర్శనలతో పంత్‌కే పోటీ ఇస్తున్నాడు.
కాబట్టి ఇప్పటిలో భరత్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. భరత్ చివరగా టీమిండియా తరపున గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై ఆడాడు. మొత్తంగా తన కెరీర్‌లో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన భరత్.. 417 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్, ఒమన్ అర్హత