రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్ 10) ఏడు మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చాయి. సౌరభ్ కుమార్ 4 వికెట్ల ఘనత.. అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) అర్ద శతకాలతో రాణించడంతో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మయాంక్ వర్మ సెంచరీ (121 నాటౌట్), ఆదిత్య సర్వటే 6, రవికిరణ్ 3 వికెట్లతో రాణించడంతో పుదుచ్చేరిపై ఛత్తీస్‌ఘడ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముషీర్ ఖాన్ (112), సిద్దేశ్ లాడ్ (127) శతకాలు.. షమ్స్ ములానీ 7 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్‌పై ముంబై ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో గెలుపొందింది.
శివమ్ మావి (101 నాటౌట్, 5 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో నాగాలాండ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ఇన్నింగ్స్ 265 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
జగదీశ్ సుచిత్ (11 వికెట్లు, హాఫ్ సెంచరీ) ఆల్‌రౌండ్ షోతో ఇరగదీయడంతో ఉత్తరాఖండ్‌పై హర్యానా ఇన్నింగ్స్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది.
సిద్దార్థ్ దేశాయ్ 10 వికెట్లు, విశాల్ జైస్వాల్ 8 వికెట్లు తీయడంతో సర్వీసెస్‌పై గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఉదయ్ సహరన్ అజేయ సెంచరీతో (117) చెలరేగడంతో ఛండీఘడ్‌పై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇవాల్టి బ్యాటింగ్ హైలైట్స్
ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు ధ్రువ్ షోరే రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. మరో విదర్భ ఆటగాడు అమన్ మోఖడే కూడా సెంచరీతో సత్తా చాటాడు.
కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు చిరాగ్ జానీ (152) భారీ సెంచరీతో కదంతొక్కాడు.
జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా ఆటగాడు శాశ్వత్ రావత్ సెంచరీతో సత్తా చాటాడు.
బౌలింగ్ హైలైట్స్
కర్ణాటక బౌలర్లు శ్రేయాస్ గోపాల్ (4), మోహ్సిన్ ఖాన్ (3) రాణించి మహారాష్ట్రను 300 పరుగులకే కట్టడి.
మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా బౌలర్ వాసుకి కౌశిక్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ బౌలర్ వంశ్‌రాజ్ శర్మ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
చదవండి: నిప్పులు చెరిగిన స్టార్క్


