తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరుగుతున్న మూడో టీ20లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. ఇండియన్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్‌ను దెబ్బకొట్టింది.
ఆమెతో పాటు స్పిన్నర్ దీప్తీ శర్మ కూడా మూడు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసింది. అయితే మిగితా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికి వికెట్ మాత్రం సాధించలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు.
కెప్టెన్ ఆతపట్టు కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. అయితే భారత బ్యాటర్లు ఉన్న జోరు ముందు ఈ స్పల్ప లక్ష్యాన్ని లంక బౌలర్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్.. మూడో మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ మరో రెండు టీ20ల మిగిలూండగానే 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.
తుది జట్లు..
శ్రీలంక: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(వికెట్ కీపర్), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదర
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి


