విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్-ఎ కెరీర్‌లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.
లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే
1. విరాట్ కోహ్లి (భారత్): 57.87- 16,207 పరుగులు
2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు
3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు
4. ఛతేశ్వర్ పుజారా (భారత్): 57.01-5759 పరుగులు
5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్): 56.68- 4648 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్ రిషబ్ పంత్(70) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైశ్వాల్ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌరవ్ చౌహన్(49), ఉర్విల్ పటేల్(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.


