T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం | BCCI bars players from staying with families sticks to its policy: Report | Sakshi
Sakshi News home page

T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం

Feb 10 2026 10:31 AM | Updated on Feb 10 2026 11:43 AM

BCCI bars players from staying with families sticks to its policy: Report

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

గతంలో అనుమతి
కాగా నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో భాగంగా క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వారం రోజుల పాటు అక్కడే ఉండేలా బీసీసీఐ గతంలో అనుమతించేది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శనతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌ చేతిలో 3-1తో టీమిండియా ఓడిపోవడంతో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.

కొంతమంది ఆటగాళ్లు కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొన్నిసార్లు సమావేశాలకు కూడా డుమ్మా కొట్టడంతో.. ఇకపై విదేశీ పర్యటనలకు కుటుంబాన్ని అనుమతించబోమని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ తాజా వైఖరి ఏమిటన్న అంశంపై ప్రస్తుత యాజమాన్యం బోర్డును సంప్రదించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది.

తాజా వైఖరి ఇదే..
‘‘టీమిండియా మేనేజ్‌మెంట్‌ బీసీసీఐని సంప్రదించింది. ఆటగాళ్ల భార్యలు, ఫియాన్సీలు వారితో ప్రయాణం చేయవచ్చా? వారితోనే ఉండవచ్చా? అని అడిగింది. ఇందుకు బోర్డు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కుటుంబాలు ఆటగాళ్లతో స్టే చేయవద్దని చెప్పింది.

వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని.. అది కూడా వారు కోరితే మాత్రమే ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. 

వరల్డ్‌కప్‌ టోర్నీతో బిజీ
కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉంది. భారత్‌- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ లీగ్‌ దశలో సూర్య సేన లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లో సొంతగడ్డపై.. పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 15 నాటి మ్యాచ్‌ కొలంబోలో ఆడుతుంది.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీ ఆసాంతం టీమిండియా ప్రైవేటు చార్టర్‌లోనే ప్రయాణిస్తుందని సమాచారం. అదే విధంగా.. ఆటగాళ్లు తమ వ్యక్తిగత చెఫ్‌లను తీసుకువచ్చేందుకు అనుమతించిన యాజమాన్యం.. ఆటగాళ్లు బస చేసే హోటల్‌కు సమీపంలో వారు ఉండేలా చూసుకోమన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే భోజనాన్ని ఆటగాళ్లకు పంపేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం.  

ఇక వరల్డ్‌కప్‌ టోర్నీలో తొలుత అమెరికాతో తలపడ్డ టీమిండియా.. ఐసీసీ ఈవెంట్‌ను విజయంతో ఆరంభించింది. రెండోమ్యాచ్‌లో గురువారం నమీబియాతో భారత్‌ తలపడుతుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం వేదిక.

చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డ్‌కి ఉపశమనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement