India vs Namibia
-
అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్
పసికూన నమీబియాకు టీ20 వరల్డ్‌కప్-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్‌తో తలపడ్డ ఎరాస్మస్ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడు మా ‘వెన్ను’ విరిచాడుడెత్ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్‌ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘పవర్ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్ మా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.మా బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ ఉందిఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్ కూడా ఇక్కడే ఆడాము. పిచ్‌లో ఎలాంటి మార్పూ లేదు.అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన గెర్హాడ్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.వరుణ్ అద్భుత స్పెల్కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (29), వన్‌డౌన్ బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (13)లతో పాటు.. జేజే స్మిత్ (0)లను వరుణ్ అవుట్ చేశాడు.Aate hi k̶a̶a̶m̶ magic shuru kar diye! 🥶Varun Chakaravarthy wastes no time, strikes on his very first ball! ☝️ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/spt27bnTnu— Star Sports (@StarSportsIndia) February 12, 2026 కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! -
IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మాకు ఆ అవకాశమే లేదుతమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్‌లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్ సందర్భంగానూ ఎరాస్మస్ బౌలింగ్ శైలి చర్చకు దారి తీసింది.‘డెడ్ బాల్’బౌలింగ్ క్రీజ్ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్ తొలి ఓవర్లో దీనిని అంపైర్ టకర్ ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.అయితే, ఎరాస్మస్ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్ వెనక నుంచి బౌలింగ్ చేసిన ఎరాస్మస్ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్‌కు కనపడేలా బౌలింగ్ చేయడంతో సమస్య రాలేదు.నాలుగు కీలక వికెట్లుఈ తరహా బౌలింగ్‌తో పాటు తన రెగ్యులర్ ఆఫ్ స్పిన్...రౌండ్ ఆర్మ్...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్ఫ్యూజన్కు గురి చేసిన ఎరాస్మస్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), తిలక్ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్ పటేల్ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్, కెప్టెన్ ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అదరగొట్టారు: సూర్యUnfair advantage or smart bowling? 🤔@IrfanPathan, Piyush Chawla & Jatin Sapru share their thoughts on Gerhard Erasmus' action.ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/4EvladZTMz— Star Sports (@StarSportsIndia) February 12, 2026 -
వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అదరగొట్టారు: సూర్య
టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో నమీబియాను 93 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. వరుసగా రెండు మ్యాచ్‌లోనూ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని సూర్య తెలిపాడు."ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. వాంఖడే వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేనప్పటికి ఇషాన్, సంజూ మాత్రం మా ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించారు. అదేవిధంగా వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన భాగస్వామ్యం మాకు చాలా కీలకంగా మారింది.క్లిష్ట సమయంలో వారిద్దరూ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక దశలో 240-250 పరుగులు దాటుతామనిపించినా, నమీబియా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా జస్ప్రీత్ తన రిథమ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నాము. అలాగే స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తున్నారు. వారిద్దరిది అద్భుతమైన కాంబినేషన్. హార్దిక్ పాండ్యా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొత్త బంతితో, పాత బంతితో గానీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మా తదుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాక్‌తో భారత్ తలపడనుంది.భారత్ ఆల్‌రౌండ్ షో..ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో 116 పరుగులకే కుప్పకూలింది. -
T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్
భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్ మొత్తంలో (అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, దేశవాలీ) 250 వికెట్లు పూర్తి చేసిన కొద్ది మంది బౌలర్ల సరసన నిలిచాడు. అర్షదీప్ కేవలం 188 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. జాన్ ఫ్రైలింక్ వికెట్ అర్షదీప్‌కు 250వ వికెట్.అర్షదీప్ కెరీర్ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8పైగా ఉంది. టీ20 కెరీర్ మొత్తంలో అర్షదీప్ ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అర్షదీప్ తన టీ20 కెరీర్లో ఎక్కువ శాతం భారత్, పంజాబ్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అర్షదీప్ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున (121) అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. ఐపీఎల్లో అర్షదీప్ 97 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నమీబియాతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలు బాది భారత్‌కు ఈ స్కోర్ అందించారు.మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు.ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఓటమి దిశగా సాగుతుంది. 11 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 88-5గా ఉంది. వరుణ్ చక్రవర్తి 3, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసి నమీబియాను దెబ్బకొట్టారు. -
ఇషాన్ విధ్వంసం, హార్దిక్ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఇషాన్, హార్దిక్ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు. -
T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌కు ముందు ఏ భారత వికెట్‌కీపర్ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్ టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్ (2007, 2024) అయినా, ఓ వికెట్‌కీపర్ బ్యాటర్ హాఫ్ సెంచరీ సాధించలేకపోవడం నిజంగానే ఆశ్చర్యకరం.20 బంతుల్లో హాఫ్ సెంచరీఈ రికార్డు హాఫ్ సెంచరీని ఇషాన్ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. మూడో ఓవర్లో అతను సహజ మోడ్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్.. ఆమరుసటి ఓవర్లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్ వేసిన ఆ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్లో వరుసగా మరో సిక్సర్, బౌండరీ కొట్టాడు. అనంతరం 7వ ఓవర్ తొలి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్ ధాటికి భారత్ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.అంతకుముందు సంజూ శాంసన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్ సిక్సర్లు, బౌండరీ కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ ఔటయ్యాక భారత స్కోర్ కాస్త నెమ్మదించింది.హార్దిక్ లైన్లోకి వచ్చాడుఅయితే హార్దిక్ పాండ్యా రాకతో భారత స్కోర్ మళ్లీ జోరందుకుంది. హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 205/5గా ఉంది. శివమ్ దూబే (23), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. -
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్ నమీబియా మ్యాచ్‌తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.యూఎస్ఏ మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్ డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. అభిషేక్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్ అవుతుంది. అభిషేక్ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్ ఫలితాన్ని భారత్‌కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్ ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.కాగా, నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్‌లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూఅభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆతర్వాతి బంతికే బౌలర్ బెన్ షికోంగో ఉచ్చులో (స్లో బాల్) చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్ కిషన్ 11, తిలక్ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
నమీబియాతో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే గత మ్యాచ్‌లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్ కూడా ఈ మ్యాచ్‌లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈసారి వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్‌తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.అన్యాయంఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్ మ్యాచ్‌లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని తప్పుబట్టాడు.టీమిండియాకు రెండు.. మాకు సున్నా!కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్‌లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే రాత్రి షెడ్యూల్ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్.. కనీసం ప్రాక్టీస్‌కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్ సెషన్లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్‌కు ముందు మాకు నైట్ సెషన్ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారనుకుంటా.నమీబియన్ల పోరాట పటిమ చూస్తారువాళ్లతో పాటు కెనడా కూడా నైట్ సెషన్లో ప్రాక్టీస్ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అదే విధంగా..‘‘నమీబియాలో మాకు ఫ్లడ్‌లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్‌లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.UPDATE: భారత్‌కు భారీ విజయం.. 93 పరుగులతో నమీబియా ఓటమిచదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం గాయపడ్డాడు. నమీబియాతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కాలి బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌లో యార్కర్‌ను ఎదుర్కొనేందుకు ఇషాన్ సిద్ధపడగా.. బంతి బలంగా అతడి బొటనవేలికి తగింది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.గాయం గనుక తిరగబెడితేప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే, గాయం గనుక తిరగబెడితే ఇషాన్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం కష్టమే. కాగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.అభిషేక్ డిశ్చార్జ్ అయినా..ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అభిషేక్ బుధవారం డిశ్చార్జ్ అయినట్లు మరో బ్యాటర్ తిలక్ వర్మ వెల్లడించాడు. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపాడు. అయితే, నమీబియాతో మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్న అంశం మీద మాత్రం తిలక్ స్పష్టతనివ్వలేదు.ఇంతలో ఇషాన్ కిషన్‌కు కూడా స్వల్ప గాయం కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, కాసేపటికే పరిస్థితి బాగుపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే రాణా అవుట్‌కాగా యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల అమెరికాతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇక తీవ్రమైన జ్వరం కారణంగా అమెరికాతో మ్యాచ్ ఆడలేకపోయిన బుమ్రా సైతం తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ కోలుకోనట్లయితే ఇషాన్‌తో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్-‘ఎ’లో భాగంగా అమెరికాపై గెలిచిన టీమిండియా... తదుపరి గురువారం నమీబియాతో తలపడనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: IND vs NAM: మరో కూనతో పోరు -
IND vs NAM: మరో కూనతో పోరు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి పోరులో అమెరికాపై విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్ తో ఆడనున్న టీమిండియా దానికి ముందు నమీబియాతో మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా వాడుకోవాలని భావిస్తోంది. బలాబలాలు, అనుభవం దృష్ట్యా ఇరుజట్లలో చాలా అంతరం ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమిండియా... నమీబియాపై కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. అస్వస్థత కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. బుధవారం డిశ్చార్జి అయి జట్టుతో కలిశాడు. అయితే నేటి పోరులో అతను ఆడే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ అభిషేక్ దూరమైతే సంజూ సామ్సన్‌కు అవకాశం లభించవచ్చు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోగా... ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ కాలికి గాయమైంది. ఇక తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన నమీబియా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న చందంగా రాణించాలని చూస్తోంది. ఢిల్లీ పిచ్ అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు సమానంగా సహకరించనుంది. మైదానం చిన్నది కావడంతో కుదురుకుంటే భారీ స్కోర్లు ఖాయమే! అభిషేక్‌పైనే అందరి దృష్టి గత రెండేళ్లుగా భారత జట్టు టి20 ఫార్మాట్లో నిలకడగా విజయాలు సాధించడంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కృషి ఎంతో ఉంది. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఈ ‘బిగ్ హిట్టర్’ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో ‘డకౌట్’ అయ్యాడు. ‘పవర్ ప్లే’ లోపే మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా గల అభిషేక్... రెండో మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే రూపంలో బ్యాటర్లకు కొదవలేదు. గత మ్యాచ్‌లో సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు మంచి స్కోరు చేయగలిగింది. వరల్డ్‌కప్‌నకు ఒక్క రోజు ముందు పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అమెరికాతో పోరులో ఆడని బుమ్రా తుది జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. వాషింగ్టన్ సుందర్ కోలుకున్నా... ఇప్పడు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయడం కష్టమే. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు. పోటీనిచ్చేనా! అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేని నమీబియా... టీమిండియాపై సంచలన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. 2021 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏకైక మ్యాచ్ జరగ్గా... టీమిండియా అలవోక విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌తో ప్లేయర్లంతా ఫామ్‌లోకి రావాలని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. నెదర్లాండ్స్‌తో పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నమీబియాపై అంచనాలు లేకపోయినా... ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని టీమిండియా యోచిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నమీబియాపై ఫుల్ ప్రాక్టీస్ చేయాలని మనవాళ్లు చూస్తున్నారు. వరల్డ్‌కప్‌నకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు చేతిలోనూ నమీబియా పరాజయం పాలైంది. అలాంటిది బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను ఎదుర్కొని నమీబియా బ్యాటర్లు నిలవగలరా చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్/సామ్సన్, ఇషాన్, తిలక్, హార్దిక్, రింకూ, శివమ్ దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా/సిరాజ్, వరుణ్. నమీబియా: ఎరాస్మస్ (కెప్టెన్ ), స్టీన్ కాంప్, ఫ్రైలింక్, జాన్ నికోల్, జేజే స్మిత్, జెన్ గ్రీన్, లైచెర్, విలియమ్ మైబుర్గ్, రూబెన్, బెర్నార్డ్ స్కాట్జ్, బెన్ షికొంగో.టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X ఒమన్‌వేదిక: పల్లెకెలె; ఉ.గం. 11 నుంచి నేపాల్ X ఇటలీవేదిక: ముంబై; మ.గం. 3 నుంచిభారత్ X నమీబియావేదిక: న్యూఢిల్లీ; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీమిండియాకు గుడ్ న్యూస్
రేపు (ఫిబ్రవరి 12) నమీబియాతో జరుగబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందుతుంది. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిషేక్ సహ టీమిండియా సభ్యుడు తిలక్ వర్మ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. అయితే అభిషేక్ రేపటి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నదానిపై మాత్రం తిలక్ క్లారిటీ ఇవ్వలేదు.అభిషేక్ జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియాకు మరో సమస్య వచ్చి పడింది. అభిషేక్ నమీబియా మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేడేమోనని, జట్టు మేనేజ్మెంట్ సంజూ శాంసన్‌ను రేపటి మ్యాచ్‌కు సిద్దం చేసింది. సంజూ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి ఇవాళ కూడా నెట్స్‌లో చాలాసేపు శ్రమించాడు. మ్యాచ్ సమయానికి అభిషేక్ ఫిట్ అయితే, ఆఖరి నిమిషంలో అయినా సంజూకు హ్యాండ్ తప్పకపోవచ్చు.ఒకవేళ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ (ఫిబ్రవరి 15) వరకు అభిషేక్‌కు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం, నమీబియాతో మ్యాచ్‌లో ఇషాన్, సంజూ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సంజూ నమీబియా మ్యాచ్‌లో రాణిస్తే.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు అభిషేక్‌తో పోటీపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఇటీవలికాలంలో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ మ్యాచ్ సందర్భంగానే అతను తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆతర్వాత టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్లో (ఢిల్లీ) డిన్నర్‌కు వెళ్లినప్పుడు పరిస్థితి క్షీణించి, ఆసుపత్రిలో చేరాడు. ఈ ప్రపంచకప్‌లో అభిషేక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అతను తన సహజ శైలిలో అందించే మెరుపు ఆరంభాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. అభిషేక్ ప్రతి మ్యాచ్‌లో 30, 40 పరుగులు చేసినా టీమిండియా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి, ఆ స్కోర్లను విజయంవంతంగా కాపాడుకోవచ్చు. అభిషేక్‌తో పాటు టీమిండియా సభ్యులంతా తలో మ్యాచ్‌లో సత్తా చాటినా భారత్ మరోసారి ప్రపంచకప్ ఎగరేసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..
టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఓ ఆటగాడు జట్టులోకి వస్తే మరో ప్లేయర్ దూరమవుతున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా వరల్డ్‌కప్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. నమీబియాతో మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.అదే విధంగా.. తీవ్రమైన జ్వరం కారణంగా టీ20 ప్రపంచకప్-2026 తొలి మ్యాచ్‌కు దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కోలుకున్నాడు. అమెరికాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న అతడు గురువారం నాటి మ్యాచ్ కోసం ఇప్పటికే సన్నద్ధమయ్యాడు.ఆస్పత్రిపాలైన అభిషేక్ శర్మఇలాంటి శుభ తరుణంలో టీమిండియాకు మరో చేదువార్త. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆస్పత్రిపాలైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అభిషేక్ శర్మ కడుపు నొప్పితో పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొంది.ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు అభిషేక్ శర్మ దూరమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కటే కూడా ధ్రువీకరించాడు. ‘‘అభి ఇప్పటికీ ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్నాడు. పూర్తిగా కోలుకుని మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నాం’’ అని తెలిపాడు.అందుబాటులో ఉండకపోవచ్చుఅయితే, బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. సమస్య ఏమిటో కనుక్కునేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. అతడు డిశ్చార్జ్ అవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నమీబియాతో మ్యాచ్‌కు మాత్రం అతడు అందుబాటులో ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.కాగా అభిషేక్ శర్మ గనుక దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తిరిగి ఓపెనర్‌గా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విఫలం కావడంతో అతడి స్థానంలో అభిషేక్‌కు జోడీగా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చాడు. సంజూకు ఛాన్స్ఇక అమెరికాతో తొలి మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టిన టీమిండియా.. గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో తలపడుతుంది. కాగా అమెరికాతో మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిని విషయం తెలిసిందే. అయితే, ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఈ విధ్వంసకర ఓపెనర్ ఆట తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు.చదవండి: నితీశ్ కుమార్ రెడ్డి వీరోచిత పోరాటం -
T20 WC 2026: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సంజూ శాంసన్ జాక్‌పాట్ కొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో దారుణంగా విఫలమవడంతో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిన అతను.. అనూహ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చేలా ఉన్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లో సంజూ ఆడటం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రెగ్యులర్ ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సమస్యతో బాధపడుతుండటం సంజూకి కలిసొచ్చేలా ఉంది. నమీబియాతో మ్యాచ్ సమయానికి అభిషేక్ అందుబాటులో ఉండటం కష్టమేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే పరోక్షంగా వెల్లడించాడు. ఇవాళ (ఫిబ్రవరి 10) అతను మీడియాతో మాట్లాడుతూ.. అభిషేక్ సహా మిగతా కీలక ఆటగాళ్లకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. అభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతూ ఇంకా జట్టుతో కలవలేదని, నమీబియా మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. అభిషేక్ గైర్హాజరీలో సంజూ శాంసన్‌కు అవకాశం రావచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ఒకవేళ సంజూ తుది జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.డష్కటే.. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండే విషయంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. బుమ్రా జ్వరంతో తొలి మ్యాచ్ మిస్ అయినా, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని, నమీబియాపై ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని వెల్లడించాడు.వాషింగ్టన్ సుందర్ కూడా రిబ్ ఫ్రాక్చర్ నుంచి కోలుకొని జట్టులో చేరాడని తెలిపాడు. సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనే విషయంపై మాత్రం డష్కటే స్పష్టతనివ్వలేదు.ఇదే సందర్భంగా డష్కటే భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై కూడా స్పందించాడు. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. పాక్ తమ మనసు మార్చుకొని భారత్‌తో ఆడేందుకు సిద్దమవడం మంచి పరిణామంగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపాడు.కాగా, బుమ్రా, సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్ స్థానంలో బుమ్రా వచ్చినా, సుందర్ కోసం ఎవరిని తప్పిస్తారన్నది చర్చనీయాంశమైంది. అవకాశాలను పరిశీలిస్తే, అక్షర్ పటేల్ స్థానంలో సుందర్ తుది జట్టులోకి రావచ్చు. అభిషేక్ అందుబాటులోకి రాక సంజూ శాంసన్‌కు అవకాశం వస్తే.. నమీబియాతో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఇలా ఉండవచ్చు.నమీబియాతో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
IND VS NAM: భారత తుదిజట్టు ఇదే.. సిరాజ్ అవుట్!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. పసికూన అమెరికా పటిష్ట భారత జట్టుకు కఠిన సవాలు విసిరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝులిపించడం.. బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.సూర్యకుమార్ ధనాధన్ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ అనూహ్య రీతిలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో తిలక్ వర్మ (25) ఫర్వాలేదనిపించగా.. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ (49 బంతుల్లో 84 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది టీమిండియా. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్లు తీసి అమెరికాను కష్టాలోకి నెట్టాడు. ఓపెనర్లు ఆండ్రీస్ గౌస్ (6), సాయితేజ ముక్కామల్ల (2)ల వికెట్లను సిరాజ్ పడగొట్టగా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (0)ను అర్ష్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనక్కి పంపాడు.రాణించిన సిరాజ్మొత్తంగా సిరాజ్ మూడు, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా 20 ఓవర్లలో అమెరికాను 132-8 పరుగులకే పరిమితం చేసి టీమిండియా 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో మ్యాచ్‌లో గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో టీమిండియా తలపడనుంది.వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకిఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. అయితే, అతడికి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో సిరాజ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉండదని అభిప్రాయపడ్డాడు.సిరాజ్‌పై వేటు తప్పదుకాగా హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్య రీతిలో సిరాజ్ వరల్డ్‌కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అమెరికాతో మ్యాచ్‌కు ముందు బుమ్రా జ్వరంతో బాధపడిన కారణంగా ఏకంగా తుదిజట్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ రాగా.. మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, బుమ్రా తిరిగి వస్తే మాత్రం సిరాజ్‌పై వేటు తప్పదని బంగర్ అన్నాడు.నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని జట్టుతో చేరడం శుభసూచకం. అతడి నైపుణ్యాలపై టీమిండియా యాజమాన్యానికి గట్టి నమ్మకం ఉంది. టోర్నీ ఆరంభం నుంచి అందుబాటులో లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించడం ఇందుకు నిదర్శనం.స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వాషీకి ఆ ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో వాషీ తుదిజట్టులోకి రాలేడు. ఇక బుమ్రా తిరిగి వస్తాడు కాబట్టి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను పక్కనపెట్టక తప్పదు’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయప్డాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఇషాన్‌ను తీసుకువచ్చింది. మున్ముందు మ్యాచ్‌లలోనూ అతడినే ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది.నమీబియాతో మ్యాచ్‌కు భారత తుదిజట్టు అంచనాఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా/మొహమ్మద్ సిరాజ్.చదవండి: భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించిన పాక్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే -
T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.గతంలో అనుమతికాగా నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో భాగంగా క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వారం రోజుల పాటు అక్కడే ఉండేలా బీసీసీఐ గతంలో అనుమతించేది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శనతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ చేతిలో 3-1తో టీమిండియా ఓడిపోవడంతో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.కొంతమంది ఆటగాళ్లు కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొన్నిసార్లు సమావేశాలకు కూడా డుమ్మా కొట్టడంతో.. ఇకపై విదేశీ పర్యటనలకు కుటుంబాన్ని అనుమతించబోమని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ తాజా వైఖరి ఏమిటన్న అంశంపై ప్రస్తుత యాజమాన్యం బోర్డును సంప్రదించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.తాజా వైఖరి ఇదే..‘‘టీమిండియా మేనేజ్మెంట్ బీసీసీఐని సంప్రదించింది. ఆటగాళ్ల భార్యలు, ఫియాన్సీలు వారితో ప్రయాణం చేయవచ్చా? వారితోనే ఉండవచ్చా? అని అడిగింది. ఇందుకు బోర్డు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కుటుంబాలు ఆటగాళ్లతో స్టే చేయవద్దని చెప్పింది.వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని.. అది కూడా వారు కోరితే మాత్రమే ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. వరల్డ్‌కప్ టోర్నీతో బిజీకాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ లీగ్ దశలో సూర్య సేన లీగ్ దశలో మూడు మ్యాచ్‌లో సొంతగడ్డపై.. పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 15 నాటి మ్యాచ్ కొలంబోలో ఆడుతుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ టోర్నీ ఆసాంతం టీమిండియా ప్రైవేటు చార్టర్‌లోనే ప్రయాణిస్తుందని సమాచారం. అదే విధంగా.. ఆటగాళ్లు తమ వ్యక్తిగత చెఫ్‌లను తీసుకువచ్చేందుకు అనుమతించిన యాజమాన్యం.. ఆటగాళ్లు బస చేసే హోటల్‌కు సమీపంలో వారు ఉండేలా చూసుకోమన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే భోజనాన్ని ఆటగాళ్లకు పంపేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక వరల్డ్‌కప్ టోర్నీలో తొలుత అమెరికాతో తలపడ్డ టీమిండియా.. ఐసీసీ ఈవెంట్‌ను విజయంతో ఆరంభించింది. రెండోమ్యాచ్‌లో గురువారం నమీబియాతో భారత్ తలపడుతుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌కి ఉపశమనం -
T20 WC 2026: టీమిండియాకు శుభవార్త
టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు భారత ప్రధాన జట్టులో మార్పులు జరిగాయి. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల దూరం కాగా.. సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అనూహ్య రీతిలో..దాదాపు ఏడాదిన్నర క్రితం చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడిన సిరాజ్ (Mohammed Siraj).. అనూహ్య రీతిలో వరల్డ్‌కప్ జట్టులోకి రావడమే కాకుండా.. తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా అమెరికాతో తలపడగా.. భారత్ విజయంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ హైదరాబాదీ పేసర్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన సిరాజ్ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.టీమిండియాకు శుభవార్తఇదిలా ఉంటే.. టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన సుందర్ (Washington Sundar) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. పూర్తి ఫిట్నెస్ సాధించిన ఈ చెన్నై చిన్నోడు.. నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు.అమెరికాపై గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘వాషీ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతడు బాగున్నాడు. అంతా బాగుంది’’ అని తెలిపాడు. ఇక బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడన్న సూర్య.. వాతావరణ మార్పు వల్లే అతడు ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.కాగా ముంబై వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా.. అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి గెలుపు బోణీ కొట్టింది. తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ వేదికగా నమీబియా జట్టుతో గురువారం సూర్య సేన తలపడుతుంది.టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్! -
T20 WC: జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడేలా షెడ్యూల్ రూపొందించారు.ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో పడుతున్నాయి. మరి టోర్నీకి ఖరారైన ఇరవై జట్లలో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్ టైమింగ్స్... ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర విషయాలు తెలుసుకుందామా?!గ్రూప్-ఎభారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.యూఎస్ఏమోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభం రంజానే.నమీబియాగెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ షాల్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్ల్యుపి మైబర్, మాక్స్ హీంగోరిజర్వు ప్లేయర్: అలెగ్జాండర్ వోల్షెంక్నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాచ్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్మ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్‌డెర్ మెర్వే, పాల్ వాన్ మెకరెన్, సకీబ్ జుల్ఫికర్పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్.గ్రూప్-బిఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాశ్రీలంకదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఇషాన్ మలింగజింబాబ్వేసికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స, రిచర్డ్ ఎంగరవ, బ్రెండన్ టేలర్ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రామనంది, అమీర్ కలీమ్గ్రూప్-సిఇంగ్లండ్హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్వెస్టిండీస్షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.ఇటలీవేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకానేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్గ్రూప్-డిసౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదీఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్ రహీమి, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, డార్విష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్, జియా ఉర్ రెహమాన్ షరీఫీరిజర్వ్స్: AM గజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్కెనడాదిల్ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ సింగ్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధలీవాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వా, యువ్‌రాజ్ సమ్రాయూఏఈముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.వేదికలు👉భారత్- కోల్‌కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ 👉శ్రీలంక- కొలంబో, పల్లకెలె👉ఫైనల్- అహ్మదాబాద్మ్యాచ్ ఆరంభ సమయం👉ఉదయం మ్యాచ్‌లు: 11 గంటలకు ఆరంభం👉మధ్యాహ్నం మ్యాచ్‌లు: 3 గంటలకు ఆరంభం👉రాత్రి మ్యాచ్‌లు: 7 గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ వివరాలు👉టీవీలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం👉డిజిటల్ మీడియాలో జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం👉తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో జియో స్టార్ టీవీలో కామెంట్రీ👉జియోహాట్‌స్టార్‌లో పై భాషలతో పాటు బెంగాలీ, భోజ్‌పురి, హర్యాన్వీ భాషల్లోనూ వ్యాఖ్యానం.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్


