టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్‌ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు.
అలాగే గత మ్యాచ్‌లో (యూఎస్‌ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్ కూడా ఈ మ్యాచ్‌లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.
తుది జట్లు..
భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో


