breaking news
Gerhard Erasmus
-
పసికూన.. ‘ప్రపంచ రికార్డు’!
సొంతగడ్డపై నమీబియా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన ఏకైక అసోసియేట్ జట్టుగా నిలిచింది. కాగా నమీబియా.. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా విండ్‌హోక్ నమీబియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌తో శుక్రవారం ఈ సిరీస్‌కు తెరలేచింది. నమీబియా క్రికెట్ గ్రౌండ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 163 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఓపెనర్ల ధనాధన్టాపార్డర్లో ఓపెనర్లు లూరేన్ స్టీన్కాంప్ (29 బంతుల్లో 41), జాన్ ఫ్రిలింక్ (38 బంతుల్లో 60) ఆకట్టుకోగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ గెర్హాడ్ ఎరాస్మస్ 19 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వారిలో అలెగ్జాండర్ విలోషెంక్ (13*), రూబెల్ ట్రంపెల్మాన్ (12) మాత్రమే పది పరుగుల మార్కు దాటగా.. మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెనేలన్ సుబ్రేయాన్ మూడు వికెట్లతో మెరవగా.. కెప్టెన్ బిజోర్న్ ఫార్చూన్, అరంగేట్ర ఆటగాడు డువాన్ యాన్సెన్ తలా రెండు.. నకొబాని మొకోనా, డెవాల్డ్ బ్రెవిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 145 పరుగులకే పరిమితమైంది. డెవాల్డ్ బ్రెవిస్ ఒంటరి పోరాటం (50 బంతుల్లో 75) వృథాగా పోయింది.తొలి జట్టుగా చరిత్ర..టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాను ఓడించింది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో సౌతాఫ్రికాపై గెలిచిన తొలి అసోసియేట్ జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. అయితే, 2025లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నమీబియా సౌతాఫ్రికాను తొలిసారి ఓడించి నెదర్లాండ్స్ తర్వాతి స్థానంలో నిలిచింది. తాజాగా మరోసారి ప్రొటిస్ జట్టుపై గెలిచి (16 పరుగుల తేడాతో).. రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి అసోసియేట్ జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.ఫైనల్ చేరతాం.. గెలుస్తాంటీ20 ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాపై తొలి మ్యాచ్‌లో గెలుపొందడంపై నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ హర్షం వ్యక్తం చేశాడు. రెండోసారి తాము ఈ పని చేశామని.. ఇదేమీ గాలివాటం విజయం కాదన్నాడు. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారని ప్రశంసించాడు. ఈ సౌతాఫ్రికా- నమీబియా సిరీస్‌లో ఫైనల్ చేరి.. టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. చదవండి: సూర్యకుమార్ యాదవ్ ఆవేదన -
టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా జట్టుకు పసికూన నమీబియా ఊహించని షాక్ ఇచ్చింది. విండ్‌హోక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. టీ20ల్లో సఫారీలను చిత్తు చేయడం నమీబియాకు ఇది రెండోసారి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ట్రై సిరీస్‌కు సౌతాఫ్రికా తమ బి జట్టును ఆడేందుకు పంపించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు జాన్ ఫ్రైలింక్ (38 బంతుల్లో 60), లోరెన్ స్టీన్కాంప్ (29 బంతుల్లో 41) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో గెర్హార్డ్ ఎరాస్మస్ (19), అలెక్సాండర్ (13 నాటౌట్) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రినెలన్ సుబ్రయెన్ 3 వికెట్లు తీయగా, డాన్ జాన్సెన్, జోర్న్ ఫోర్టున్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. డెవాల్డ్ బ్రెవిస్ (50 బంతుల్లో 75) రాణించినప్పటికీ మిగతావాళ్ల నుంచి సహకారం కరువైంది. చివర్లో డాన్ జాసన్ (17 బంతుల్లో 25 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెలమన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. సరిగ్గా పది నెలల క్రితం ఇదే వేదికపై సౌతాఫ్రికాను నమీబియా తొలిసారి టీ20ల్లో మట్టికరిపించడం విశేషం.Read: నైట్‌క్లబ్ ఉదంతం.. స్టోక్స్‌ను చావుదెబ్బ తీసిన భారత బౌలర్? -
అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్
పసికూన నమీబియాకు టీ20 వరల్డ్‌కప్-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్‌తో తలపడ్డ ఎరాస్మస్ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడు మా ‘వెన్ను’ విరిచాడుడెత్ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్‌ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘పవర్ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్ మా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.మా బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ ఉందిఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్ కూడా ఇక్కడే ఆడాము. పిచ్‌లో ఎలాంటి మార్పూ లేదు.అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన గెర్హాడ్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.వరుణ్ అద్భుత స్పెల్కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (29), వన్‌డౌన్ బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (13)లతో పాటు.. జేజే స్మిత్ (0)లను వరుణ్ అవుట్ చేశాడు.Aate hi k̶a̶a̶m̶ magic shuru kar diye! 🥶Varun Chakaravarthy wastes no time, strikes on his very first ball! ☝️ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/spt27bnTnu— Star Sports (@StarSportsIndia) February 12, 2026 కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! -
IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మాకు ఆ అవకాశమే లేదుతమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్‌లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్ సందర్భంగానూ ఎరాస్మస్ బౌలింగ్ శైలి చర్చకు దారి తీసింది.‘డెడ్ బాల్’బౌలింగ్ క్రీజ్ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్ తొలి ఓవర్లో దీనిని అంపైర్ టకర్ ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.అయితే, ఎరాస్మస్ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్ వెనక నుంచి బౌలింగ్ చేసిన ఎరాస్మస్ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్‌కు కనపడేలా బౌలింగ్ చేయడంతో సమస్య రాలేదు.నాలుగు కీలక వికెట్లుఈ తరహా బౌలింగ్‌తో పాటు తన రెగ్యులర్ ఆఫ్ స్పిన్...రౌండ్ ఆర్మ్...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్ఫ్యూజన్కు గురి చేసిన ఎరాస్మస్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), తిలక్ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్ పటేల్ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్, కెప్టెన్ ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అదరగొట్టారు: సూర్యUnfair advantage or smart bowling? 🤔@IrfanPathan, Piyush Chawla & Jatin Sapru share their thoughts on Gerhard Erasmus' action.ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/4EvladZTMz— Star Sports (@StarSportsIndia) February 12, 2026 -
నమీబియాతో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే గత మ్యాచ్‌లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్ కూడా ఈ మ్యాచ్‌లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈసారి వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్‌తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.అన్యాయంఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్ మ్యాచ్‌లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని తప్పుబట్టాడు.టీమిండియాకు రెండు.. మాకు సున్నా!కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్‌లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే రాత్రి షెడ్యూల్ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్.. కనీసం ప్రాక్టీస్‌కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్ సెషన్లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్‌కు ముందు మాకు నైట్ సెషన్ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారనుకుంటా.నమీబియన్ల పోరాట పటిమ చూస్తారువాళ్లతో పాటు కెనడా కూడా నైట్ సెషన్లో ప్రాక్టీస్ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అదే విధంగా..‘‘నమీబియాలో మాకు ఫ్లడ్‌లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్‌లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.UPDATE: భారత్‌కు భారీ విజయం.. 93 పరుగులతో నమీబియా ఓటమిచదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!


