మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను కోల్పోవడమే కాదు..తన పుట్టుక కూడా ఒక శాపంగా మారింది ఆ చిన్నారికి. తనెందుకు అందరికంటే భిన్నంగా ఉంటున్నా..తనలో ఈ మార్పు అందకానీ గందరగోళంలో సాగింది అతడి బాల్యం. తన శారీరక మార్పుని తప్పుగా చూపిస్తూ సమాజం చేత ఛీత్కారాలు, హేళనలతో బిక్కుబిక్కుమంటూ బతికాడు.
కానీ కష్టాల కొలిమిలో అతడకి దారి చూపేది కేవలం చదువు మాత్రమే అని విశ్వసించి మొత్తం దృష్టి దాని మీదే పెట్టాడు. ఉన్నత చదువు కోసం విదేశాల వరకు వెళ్లి..తను అందరిలాంటి వాడిని కాదని తెలుసుకోవడమే గాక తనలాంటి వాళ్లు కూడా ఉన్నారని తెలసుకుని ఇన్నాళ్లు ముసుగులో బతికే ఆ బాలుడు కాస్త అమ్మాయిగా స్వతంగా సగర్వంగా బతకడమే కాదు తనలాంటి వాళ్లకు స్ఫూర్తిగా మారాడు.
అతడే సూరి అనే ట్రాన్స్‌జెండర్. హర్యానాకు చెందిన సూరి మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అమ్మమ్మ, అత్తల చెంత పెరిగాడు. తనలోని విభిన్నమైన మార్పు తనకే అర్థంకానీ తరుణంలో సమాజం నుంచి ఎదురవ్వుతున్న చీత్కారాలకు తల్లడిల్లిపోయాడు. తానెంటో తన పరిస్థితి ఏంటో అమ్మమ్మకు, అత్తకు వివరించడంతో..బయటకు ఈ విషయ పొక్కనీయకుండా బాలుడిలానే పెంచారు.
ఎన్ని హేళనలు, అవమానాలు వస్తున్నా..చదువే తన గమ్యం, లక్ష్యంగా చదవడం ప్రారంభించాడు. అలా ఉన్నత చదువులు చదివి జర్మనీలో పీహెచ్‌డీ చేసే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా బ్రెయిన్ కేన్సర్‌పై పీహెచ్‌డీ పరిశోధన చేస్తున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచింది. అక్కడకు వెళ్లాకే తనలాంటి ట్రాన్సజెండర్ మహిళలు ఉన్నారని తెలుసుకుని ఇది ఒక లోపం కాదని గుర్తిస్తుంది. వాళ్ల అందరిక కథలు తనలాంటివేనని తెలుసుకుని అలాంటి వాళ్ల కోసం పాటుపడుతోందామె. అప్పటి నుంచే ముసుగు తొలగించి ట్రాన్స్‌జెండర్ మహిళ స్వేచ్ఛగా బతకడం ప్రారంభించిందామె.
(చదవండి: ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ)


