రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'(irumudi movie) ఈ శుక్రవారమే రిలీజ్.
ఈ మూవీలో రవితేజ కూతురిగా చేసిన పాప మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఈ పాప పేరు నక్షత్ర(Nakshathra) కేరళలోని కన్నూరు ఈమె సొంతూరు.
చిన్నప్పుడే పలు యాడ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత నటిగా మారింది.
మలయాళంలో బాలనటిగా రెండు మూవీస్ చేసింది. రీసెంట్‌గా పృథ్వీరాజ్ 'ఐ నోబడీ'లో కనిపించింది.
కన్నడలో స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి 'డాడ్'లో చేసింది. ఇది రిలీజ్ కావాల్సి ఉంది.
ఇంతలోనే 'ఇరుముడి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రింగు రింగుల జుట్టుతో చలాకీగా ఉన్న ఈ పాప.. 'ఇరుముడి' రిలీజ్ తర్వాత మరింత గుర్తింపు తెచ్చుకోవడం పక్కా!
(Images Source : Instagram/@nakshathra__cm)


