ప్లీజ్‌ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్‌ మహిళ | Viral Video: USA woman cant hold back tears as indian neighbours leave for india | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్‌ మహిళ

Aug 16 2026 3:55 PM | Updated on Aug 16 2026 3:58 PM

Viral Video: USA woman cant hold back tears as indian neighbours leave for india

సాధారణంగా మనకు నచ్చిన వాళ్లు లేదా మనకు బాగా పరిచయం ఉన్న పొరుగింటి వాళ్లు శాశ్వతంగా వేరోచోటికి వెళ్లిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది. అది సహజం. పైగా ఒకే దేశం, ఒకే జాతికి సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వెళ్లిపోతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్‌. కానీ దేశం కానీ దేశంలో భావోద్వేగంగా వీడ్కోలు చెప్పడం అసాధారణం. కానీ అలాంటి భావోద్వేగ సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. 

ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాను విడిచివెళ్లిపోతున్న భారతీయ జంటకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది పొరగునే ఉండే అమెరికన్‌ మహిళ. ఒక్కక్షణం అది భావోద్వేగ వీడ్కోలుగా మారిపోయింది. విజయ్‌ కొక్కెరగడ్డ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఈ వీడియోని పంచుకున్నారు. డెట్రాయిట్‌లో విమానాశ్రయానికి బయలుదేరుతుండగా ఈ దృశ్యం చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. 

ఆ వీడియోలో విజయ్‌ అమెరికాలోని తన ఇంటి బయట నిలబడి ఉండగా, పోరుగునే ఉండే అమెరికన్‌ మహిళ వాళ్లను పట్టుకుని భావోద్వగానికి గురవ్వుతుంది. ప్లీజ్‌ వెళ్లిపోకండి అని కన్నీటిపర్యంతమవుతుంది. అయితే విజయ్‌ నవ్వి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియో రికార్డు చేయడం గురించి విజయ్‌కి తెలియదట. 

తన స్నేహితుడు తనకి చెప్పకుండానే ఈ వీడ్కోలుని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. అతనే తనకు ఈ వీడియో పంపడంతో షేర్‌ చేసినట్లు తెలిపాడు. ఒక రకంగా ఈ వీడియో తన వద్ద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఇది నిజమైన భావోద్వేగాలు, ప్రేమను చూపించిందని పేర్కొంటూ తన పోస్ట్‌ని ముగించాడు. నిజంగా గ్రేట్‌ కదూ..పరాయి దేశస్థులైనా..మనలానే వెళ్లిపోతుంటే భావోద్వేగానికి గురవ్వడం గ్రేట్‌ కదూ..!. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి :

(చదవండి: తొమ్మిది పదుల వయసులో అథ్లెటిక్‌గా బామ్మ..! ఆఖరికి వందేళ్ల తర్వాత కూడా..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement