కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో! | Viral Video Man Tries to Rescue Friend Whose Neck Got Stuck in a Chair Ends up Trapped Himself | Sakshi
Sakshi News home page

కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో!

Aug 16 2026 12:36 PM | Updated on Aug 16 2026 12:52 PM

Viral Video Man Tries to Rescue Friend Whose Neck Got Stuck in a Chair Ends up Trapped Himself

బీజింగ్‌: చైనాలోని ఒక ఆస్పత్రిలో చోటుచేసుకున్న విచిత్ర ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలోని వెయిటింగ్‌ హాల్‌లో కుర్చీపై విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తి లేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతని మెడ కుర్చీ ఆర్మ్రెస్ట్, బ్యాక్రెస్ట్ మధ్య భాగంలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోవడంతో, అతనికి సహాయం చేయడానికి వచ్చిన అతని స్నేహితుడు కూడా అదే రీతిలో తల దూర్చడంతో చివరకు అతని మెడ కూడా అదే కుర్చీలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొందరపాటులో మెడను బలంగా లాగడం లేదా ఇష్టానుసారంగా తిప్పడం చేయకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల నరాలకు తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. బాధితుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, మెడనొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాలని సూచించారు.

ముఖ్యంగా, ఇతరులను రక్షించే క్రమంలో ఎలాంటి అవగాహన లేకుండా ప్రయత్నించడం ప్రమాదకరమని ఈ ఘటన నిరూపించింది. ఇలాంటి సందర్భాలలో బలవంతంగా లాగడానికి బదులుగా, శిక్షణ పొందిన నిపుణులు లేదా ఆసుపత్రి సిబ్బంది సహాయం కోరడమే అత్యంత సురక్షితమైన మార్గమని నిపుణులు తెలిపారు. కాగా ఆస్పత్రి సిబ్బంది అతి కష్టం మీద వారిద్దిరి మెడలకు కర్చీ నుంచి విడదీశారు. 

 

ఇది కూడా చదవండి: అమితాబ్‌కు షాకిచ్చిన మూడడుగుల డాక్టర్‌ గణేశ్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement