మొన్న ఏమో ఇంగ్లండ్‌ను గడగడలాడించారు.. ఇప్పుడేమో ఇటలీ ముందు..! | T20 WC 2026: nepal all out for 123 runs in a match vs italy | Sakshi
Sakshi News home page

మొన్న ఏమో ఇంగ్లండ్‌ను గడగడలాడించారు.. ఇప్పుడేమో ఇటలీ ముందు..!

Feb 12 2026 4:55 PM | Updated on Feb 12 2026 5:00 PM

T20 WC 2026: nepal all out for 123 runs in a match vs italy

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో రెండు రోజుల కిందట పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసిన పసికూన నేపాల్‌, ఇవాళ (ఫిబ్రవరి 12) వారి కంటే చిన్న జట్టైన ఇటలీ ముందు తేలిపోయింది. మొన్న తన మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్లను గడగడలాడించిన లోకేశ్‌ బామ్‌.. ఇవాళ ఇటలీ బౌలర్ల ముందు తస్సుమన్నాడు. లోకేశ్‌తో పాటు ఏ ఒక్క ఆటగాడు కూడా సత్తా చాటలేకపోవడంతో ఇటలీతో మ్యాచ్‌లో నేపాల్‌ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది.

27 పరుగులు చేసిన ఆరిఫ్‌ షేక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆసిఫ్‌ షేక్‌ (20), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (23), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (17), కరణ్‌ కేసి (18 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్‌ భుర్టెల్‌, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో 5, లోకేశ్‌ బామ్‌, గుల్షన్‌ ఝా తలో 3, నందన్‌ యాదవ్‌ మరియు లలిత్‌ రాజ్‌బంశీ డకౌట్లయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇటలీ అన్ని విభాగాల్లో నేపాల్‌ను కట్టడి చేసింది. ముఖ్యంగా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. స్పిన్నర్లు క్రిషన్‌ కలుగమగే (4-0-18-3), బెన్‌ మనెన్టి (4-0-9-2), స్మట్స్‌ (4-0-22-1) నేపాల్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్‌, జస్ప్రీత్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నేపాల్‌ను దెబ్బేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement