ఇషాన్‌ విధ్వంసం, హార్దిక్‌ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్‌ | T20 World Cup 2026, Team India Set 210 Runs Target To Namibia Desite Late Collapse, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఇషాన్‌ విధ్వంసం, హార్దిక్‌ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్‌

Feb 12 2026 8:50 PM | Updated on Feb 13 2026 10:55 AM

T20 WC 2026: team india set 210 runs target to namibia

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. 

మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12;  సిక్స్‌) ఆచితూచి ఆడారు. 

శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్‌ సింగ్‌ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.

నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్‌ (4-0-50-1), బెర్నాల్డ్‌ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్‌ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement