భారత్‌తో మ్యాచ్‌ ఆడండి: పాకిస్తాన్‌ జట్టుకు ప్రభుత్వ ఆదేశం | Play the match against India: Government orders the Pakistan team | Sakshi
Sakshi News home page

భారత్‌తో మ్యాచ్‌ ఆడండి: పాకిస్తాన్‌ జట్టుకు ప్రభుత్వ ఆదేశం

Feb 10 2026 1:47 AM | Updated on Feb 10 2026 1:47 AM

Play the match against India: Government orders the Pakistan team

టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ ఆడమంటూ మొండికేసిన పాకిస్తాన్‌ జట్టు వెనక్కి తగ్గింది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడాలని ఆ దేశ ప్రభుత్వం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను ఆదేశించింది. క్రికెట్‌ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లనుంచి వచ్చిన అభ్యర్థనలకు స్పందిస్తూ భారత్‌తో మ్యాచ్‌కు పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఓకే చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  

అంతక ముందు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ), పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజోగ్‌ గుప్తా వెల్లడించారు.  వరల్డ్‌ కప్‌నుంచి దూరమైన బంగ్లాదేశ్‌కు మద్దతు పలకడంతో పాటు పలు డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. వీటిపై ఐసీసీ సానుకూలంగా స్పందించింది. బంగ్లా బోర్డుపై ఎలాంటి జరిమానాలు, ఆంక్షలు విధించమని హామీ ఇవ్వడంతో పాటు 2028 నుంచి 2031 మధ్య ఒక ఐసీసీ ఈవెంట్‌కు బంగ్లా ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కూడా ఐసీసీ చెప్పింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement