మార్క్రమ్‌ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌ | T20 WC 2026: south africa scored 213 runs vs canada | Sakshi
Sakshi News home page

మార్క్రమ్‌ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌

Feb 9 2026 9:41 PM | Updated on Feb 9 2026 9:41 PM

T20 WC 2026: south africa scored 213 runs vs canada

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కెనడాతో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ మార్క్రమ్‌ (59) విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేయగా.. ఆఖర్లో స్టబ్స్‌ (34 నాటౌట్‌), మిల్లర్‌ (39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డికాక్‌ (25), రికెల్టన్‌ (33) కూడా తలో చేయి వేశారు. బ్రెవిస్‌ (6) ఒక్కడే నిరాశపరిచాడు. కెనడా బౌలర్లలో అన్ష్‌ పటేల్‌ (4-0-31-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 

కలీమ్‌ సనా (4-0-38-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లందరినీ సఫారీ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. జస్కరన్‌ సింగ్‌ 4 ఓవర్లలో 49 పరుగులు, కెప్టెన్‌ దీల్‌ప్రీత్‌ బజ్వా 4 ఓవర్లలో 40 పరుగులు (ఓ వికెట్‌), సాద్‌ బిన్‌ జాఫర్‌ 3 ఓవర్లలో 38 పరుగులు, డిలాన్‌ హెలిగర్‌ ఓ ఓవర్‌లో 13 పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 8 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ సమ్రా (12), నికోలస్‌ కిర్టన్‌ (4), శ్రేయస్‌ మొవ్వ (9) ఔట్‌ కాగా.. నవ్‌నీత్‌ ధలీవాల్‌ (25), హర్ష్‌ థాకర్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కెనడా గెలవాలంటే మరో 72 బంతుల్లో 150 పరుగులు చేయాలి. కెనడాను లుంగి ఎంగిడి (3-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రబాడ (2-0-16-1) కూడా ఇబ్బంది పెట్టాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement