రంజీ ట్రోఫీ 2025-26లో టీమిండియా అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ దేశవాళీ టోర్నీలో బిహార్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యవంశీ.. పాట్నా వేదికగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 166 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడినప్పటికి, వైభవ్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరిని అలరించాడు.
14 ఏళ్ల వైభవ్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 67 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 138.81గా ఉంది. కేవలం 7 పరుగుల దూరంలో తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని వైభవ్ కోల్పోయాడు. బిజోన్ డే బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
కాగా ఈ టోర్నీలో బిహార్ వైస్ కెప్టెన్ సూర్యవంశీ వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత్-ఎ జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ గత కొంత కాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెఘాలయ ఇన్నింగ్స్‌లో అజయ్ దుహాన్(129) శతక్కొట్టగా.. ఛెత్రి(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే వర్షం కారణంగా తొలి రెండు రోజుల పాటు ఆట పూర్తిగా రద్దు అయింది. కేవలం ఆఖరి రెండు రోజుల ఆట మాత్రమే జరిగింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బిహార్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ కోసం భారత్ ఏ జట్టు : ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేర, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జే, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, హర్ష్ దూబె, అశుతోశ్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్రీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాంశ్ శర్మ
స్టాండ్ బై: గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుశాగ్ర, తనుష్ కోటిన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్
చదవండి: IPL 2026: ఎస్ఆర్‌హెచ్ షాకింగ్ నిర్ణయం.. విధ్వంసకర వీరుడికి గుడ్ బై!?


