అండర్-19 ఆసియాకప్ 2025లో యువ భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికల పడింది.
భారత బౌలర్ల ధాటికి పాక్ అండర్ 19 జట్టు 41.2 ఓవర్లలో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. దీపేష్ దేవేంద్రన్, కన్షిక్ చౌహన్ తలా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు కిషాన్ కుమార్ రెండు వికెట్లు సాధించారు. పేసర్ దీపేష్ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని దెబ్బతీశాడు.
పాక్ బ్యాటర్లలో హుజైఫా అహ్సాన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి అహ్సాన్ మాత్రం దూకుడుగా ఆడి భారత్‌పై ఒత్తిడిపెంచాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ముగ్గురే ముగ్గురు డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు.
అదరగొట్టిన ఆరోన్..
ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్(85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(5) విఫలమయ్యాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
చదవండి: IPL 2026: కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే?


