ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను టీమిండియా 117 పరుగులకే కట్టడి చేసింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.
మూడో వికెట్ డౌన్
గెలుపు ఖరారయ్యాక టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (12) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 109/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 30 బంతుల్లో మరో 9 పరుగులు చేస్తే చాలు. తిలక్ వర్మ (24), దూబే క్రీజ్‌లో ఉన్నారు.
సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..
92 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన గిల్.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ విజయానికి ఇంకా 26 పరుగులు కావాలి. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.
10 ఓవర్లకు భారత్ స్కోరెంతంటే?
10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(28), తిలక్ వర్మ(17) ఉన్నారు.
భారత్ తొలి వికెట్ డౌన్
60 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులతో దూకుడుగా ఆడిన అభిషేక్.. బాష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.
👉5 ఓవర్లకు భారత్ స్కోర్: 60/0. క్రీజులో అభిషేక్ శర్మ(35), గిల్(20) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న అభిషేక్
118 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22), గిల్(5) ఉన్నారు.
117 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో117 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా ప్రోటీస్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
వరుణ్ మ్యాజిక్.. ఆలౌట్ దిశగా ప్రోటీస్
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. వరుణ్ దెబ్బకు ప్రోటీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్‌గా ఫెరీరా, ఏడో వికెట్‌గా జాన్సెన్ క్లీన్ బౌల్డయ్యాడు. 15.1 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 77/7
ఐదో వికెట్ డౌన్..
33 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కార్బిన్ బాష్(4).. శివమ్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పది ఓవర్లకు ప్రోటీస్ స్కోరెంతంటే?
10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్(28), బాష్(4) ఉన్నారు.
సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్
30 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
మూడో వికెట్ డౌన్.. బ్రెవిస్ ఔట్
బ్రెవిస్(2) రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు.
సౌతాఫ్రికాకు భారీ షాక్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెండ్రిక్స్ వికెట్ల ముందు దొరికిపోగా.. రెండో ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్‌క్రమ్(4), బ్రెవిస్)2) ఉన్నారు.
ధర్మశాల వేదికగా మూడో టీ20లో సౌతాఫ్రికా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత దూరమయ్యాడు.
ఈ విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. అదేవిధంగా అక్షర్ పటేల్‌కు కూడా విశ్రాంతి ఇచ్చారు. వీరిద్దరూ స్ధానంలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ వచ్చారు. సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి చూపించారు. సౌతాఫ్రికా కూడా మూడు మార్పులు చేసింది. మిల్లర్, లిండే, సిప్లామ దూరం కాగా.. బాష్, నోర్జే, స్టబ్స్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
దక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి


