ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో వంద వికెట్ల మైలు రాయిని పాండ్యా అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులతో పాటు వంద వికెట్లు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు.
ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా పాండ్యా నిలిచాడు. అతడు ఇప్పటివరకు టీ20ల్లో 1939 పరుగులతో పాటు వంద వికెట్లను సాధించాడు. పాండ్యా దారిదాపుల్లో ఏ భారత ప్లేయర్ లేరు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టీ20ల్లో 1000+ పరుగులు & 100+ వికెట్లు తీసిన ఆటగాళ్ళు:
మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్) - 2417 పరుగులు & 104 వికెట్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 2551 పరుగులు & 149 వికెట్లు
సికందర్ రజా (జింబాబ్వే) - 2883 పరుగులు & 102 వికెట్లు
విరణ్‌దీప్ సింగ్ (మలేషియా) - 3180 పరుగులు & 109 వికెట్లు
హార్దిక్ పాండ్యా (భారత్) - 1939 పరుగులు & 100* వికెట్లు


