టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో నానా తంటాలు పడుతున్నాడు. దాదాపు రెండేళ్లగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్య.. 2025లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ముంబై ఆటగాడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
తొలి టీ20లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. రెండో టీ20లో ఐదు పరుగులే చూసి పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచకప్-2026కు ముందు అతడి పూర్ ఫామ్ టీమ్‌మెనెజ్‌మెంట్‌ను తెగ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు.
కెప్టెన్ అంటే టాస్‌లు వేయడం, ఫీల్డ్‌ను సెట్ చేయడం కాదని పరుగులు కూడా చోప్రా అన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు.
"సూర్య.. భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడమే కాదు. బ్యాట్‌తో కూడా రాణించాలి. టాప్ ఫోర్‌లో బ్యాటింగ్‌కు వస్తుందున ఖచ్చింగా పరుగులు చేయాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్‌లు ఆడాడు.
అయినా అతడి ఆట తీరు మారలేదు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మరీ ఘోరంగా ఉంది. ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు కన్పించలేదు.
మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు సాధించకపోతే జట్టుకు ఎల్లప్పుడూ అదే భారంగానే ఉంటుంది. ఇదే ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తారు. కాబట్టి కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తన ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరముందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్‌కు ఊహించని షాక్!


