ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది.
ఒక్క వరుణ్ చక్రవర్తి తప్ప మిగితా బౌలర్లు అందరూ అట్టర్‌ప్లాప్ అయ్యారు. స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అయితే దారుణ ప్రదర్శన కనబరిచాడు. పదేపదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ సఫారీ బ్యాటర్లకు టార్గెట్‌గా మారాడు. అస్సలు ఏ మాత్రం రిథమ్‌లో కన్పించలేదు.
ఒక ఓవర్‌లో 13 బంతులు
ప్రోటీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ తన చెత్త బౌలింగ్‌తో అందరికి చిరాకు తెప్పించాడు. 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1.. ఆ ఓవర్‌లో అర్ష్‌దీప్ వేసిన బంతుల వరుస ఇది. ఈ పంజాబీ పేసర్ తన ఓవర్‌ను పూర్తిచేసేందుకు ఏకంగా 13 బంతులు వేయాల్సి వచ్చింది.
తొలి బంతిని డికాక్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదగా... మిగతా 5 లీగల్ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్‌లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం అర్ష్‌దీప్‌పై సీరియస్ అయ్యాడు. ఇదేమి బౌలింగ్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చెత్త రికార్డు..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్‌దీప్ సమం చేశాడు. నవీన్ గత ఏడాది హరారేలో జింబాబ్వేపై ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే భారత్ తరపున ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి బౌలర్ మాత్రం అర్ష్‌దీపే కావడం గమనార్హం.
Gautam Gambhir angry at Arshdeep as he bowled 7 wide bowls in an over 💀 pic.twitter.com/EqUa7nFqW5
— ••TAUKIR•• (@iitaukir) December 11, 2025
చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్


