ఇంద్రకీలాద్రి : శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే ఉత్సవాలలో రెండో అతి పెద్ద ఉత్సవమైన భవానీ దీక్ష విరమణలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
దీక్ష విరమణలకు విచ్చేసిన భవానీలతో ఆలయ ప్రాంగణం అరుణ వర్ణాన్ని సంతరించుకుంది.
తెల్లవారుజామున ప్రారంభమైన భవానీల రద్దీ ఉదయం 10 గంటల వరకు కొనసాగింది.


