టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్‌ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్((46 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 90) విధ్వంసం సృష్టించగా.. డొనవాన్ ఫెరీరా(16 బంతుల్లో 30), మిల్లర్(12 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బౌలర్ల దాటికి భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ బార్ట్‌మన్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. ఎంగిడీ, సిప్లమా, జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది.
ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్..
ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది పదమూడో విజయం.
ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్‌పై ఇప్పటివరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.
భారత్‌పై అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్లు
దక్షిణాఫ్రికా-13
ఆస్ట్రేలియా-12
ఇంగ్లాండ్-12
న్యూజిలాండ్-10
వెస్టిండీస్10
చదవండి: నేను.. అతడే ఈ ఓటమికి కారణం! ప్రతీసారి కూడా: సూర్యకుమార్


