సూపర్ స్టార్ రజినీకాంత్ (#HBDRajinikanth) ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఈ ఏడాది కూలీ మూవీతో అభిమానులను అలరించారు. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన నటనతో తలైవాగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు.
ఇవాళ సూపర్ స్టార్ బర్త్ డే కావడంతో బ్లాక్‌బస్టర్ హిట్ నరసింహా మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రజినీకి పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.


