టీ20 వరల్డ్‌కప్-2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 55 రోజుల్లో భారత్, శ్రీలంక వేదిలకగా ఈ మెగా టోర్నమెంట్ షూరూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఇద్దరు ప్లేయర్ల పేలవ ఫామ్ భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
అందులో ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. మరొకరు అతడి డిప్యూటీ శుభ్‌మన్ గిల్.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వీరిద్దరూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.
సూర్యకు ఏమైంది..?
ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా పేరున్న సూర్యకుమార్.. 2025లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో రాణించినప్పటికి అంతర్జాతీయ క్రికెట్‌లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి టాప్ స్కోర్ 38 పరుగులగా ఉంది. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్య తన చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు.
తనపై తనకే నమ్మకం లేక ఒక మ్యాచ్‌లో మూడో స్ధానంలో.. మరో మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకప్పుడు సూర్య క్రీజులో ఉంటే బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడేవారు. కానీ ఇప్పుడు అతడి వీక్‌నెస్‌ను పసిగట్టిన బౌలర్లు.. అతడిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడనుంది.
సౌతాఫ్రికాతో మూడు, న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లలో సూర్య తిరిగి తన ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. లేదంటే భారత్‌కు బ్యాటింగ్ కష్టాలు తప్పవు. ఈ సిరీస్‌లో తొలి టీ20లో కేవలం 12 పరుగులు చేసిన సూర్యకుమార్.. రెండో టీ20లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మూడో మ్యాచ్‌లోనైనా ఈ ముంబై ఆటగాడు తన బ్యాట్‌కు పనిచెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గిల్ ఢమాల్..
ఇక మొన్నటివరకు టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో అస్సలు శుభ్‌మన్ గిల్ లేడు. టీ20ల్లో భారత జట్టు ఓపెనర్లగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఉండేవారు. కానీ ఆసియాకప్ 2025కు ముందు గిల్‌ను టీ20ల్లో అనూహ్యంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటివరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి ఆ బాధ్యతలను గిల్‌కు బీసీసీఐ అప్పగించింది.
అయితే ఆల్‌ఫార్మాట్‌గా గిల్‌కు పేరు ఉన్నప్పటికి.. తన టీ20 రీ ఎంట్రీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను తప్పించి మరి అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబోయో మ్యాచ్‌లలోనైనా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ తమ ఫామ్‌ను అందుకుంటారో లేదో చూడాలి.
చదవండి: IND Vs SA: అర్ష్‌దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్


