భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనే తన కలను నేరవేర్చుకునేందుకు మనసు మార్చుకుంటున్నట్లు ఫొగాట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా 31 ఏళ్ల వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది.
పతకం ఖాయమైన వేళ అనుహ్యంగా ఆమెపై వేటు పడింది. 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో నిర్దేశించిన బరువు కంటే వినేష్ ఫొగాట్ 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెపై వేటు వేశారు. దీంతో ఆమె తన ఒలింపిక్ కల నేరవేరకుండానే భారత్‌కు తిరిగిచ్చింది.
ఆ తర్వాత ఉమ్మడి రజత పతకం ఇవ్వాలని వినేష్ ఫొగాట్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసింది. అయితే సీఏఎస్ వినేష్ ఫొగాట్ అభ్యర్థనను సీఏఎస్ తోసిపుచ్చడంతో ఆమెకు తీవ్ర నిరాశే ఎదురైంది.
ఈ క్రమంలో ఆమె రి సోషల్ మీడియా వేదికగా టైర్మెంట్ ప్రకటిస్తూ అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత ఫొగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి జులనా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎంపికైంది. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
"పారిస్ ఒలింపిక్స్‌తో నా రెజ్లింగ్ జర్నీ ముగిసిందా అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రశ్నకు ఇప్పటివరకు నేను సమాధానం చెప్పలేకపోయాను. నేను రెజ్లింగ్ మ్యాట్, ఆ ఒత్తిడి, నా లక్ష్యాల నుంచి కొన్నాళ్లపాటు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. నేను ఇప్పటికీ ఈ క్రీడను(రెజ్లింగ్) ప్రేమిస్తున్నాను" అని రిటైర్మెంట్ యూటర్న్ ప్రకటనలో ఫోగాట్ పేర్కొంది.


