వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బ్లాక్‌క్యాప్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. డెవాన్ కాన్వే(28), కేన్ విలియమ్సన్(16) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్యాంప్‌బెల్(44) , కింగ్(33) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిక్నర్ నాలుగు, రే మూడు వికెట్లు సాధించారు.
అనంతరం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 278/9 వద్ద ముగించింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డ పేసర్ టిక్నర్ బ్యాటింగ్‌కు రాలేదు. మిచెల్ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 73 పరుగుల ఆధిక్యం లభించింది. కరీబియన్ బౌలర్లలో అండర్సన్ ఫిలిప్ 3, రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్ జాకబ్ డఫీ 5 వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించాడు.
అతడితో పాటు మిచెల్ రే మూడు వికెట్లు సాధించాడు. కవీమ్ హోడ్జ్(35) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్ ఆతిథ్య జట్టు ముందు కేవలం 56 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మౌంట్ మంగునూయ్ వేదికగా డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?


