అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసిది. యువసంచలనం, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు. మొత్తంగా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా వైభవ్ కన్పించాడు. దూకుడుగా ఆడే క్రమంలో తన వికెట్‌ను కోల్పోయాడు.
వైభవ్‌తో పాటు ఆరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో అభిజ్ఞాన్ కుండు(32), కన్షిక్ చౌహన్(28) మెరుపులు మెరిపించారు. వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. యూఏఈ బౌలర్లలో యూగ్ శర్మ, సూరి తలా రెండు వికెట్లు సాధించాడు.
కాగా యూత్ వన్డేల్లో భారత్ 400 ప్లస్ పైగా పరుగులు సాధించడం ఇదే మూడో సారి. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.
చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?
[node:field_tags]
A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯
Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025


