breaking news
Under-19 Cricket Tournament
-
Asia Cup 2025:: భారత్ 433 పరుగుల భారీ స్కోర్
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసిది. యువసంచలనం, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు. మొత్తంగా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా వైభవ్ కన్పించాడు. దూకుడుగా ఆడే క్రమంలో తన వికెట్‌ను కోల్పోయాడు.వైభవ్‌తో పాటు ఆరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో అభిజ్ఞాన్ కుండు(32), కన్షిక్ చౌహన్(28) మెరుపులు మెరిపించారు. వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. యూఏఈ బౌలర్లలో యూగ్ శర్మ, సూరి తలా రెండు వికెట్లు సాధించాడు. కాగా యూత్ వన్డేల్లో భారత్ 400 ప్లస్ పైగా పరుగులు సాధించడం ఇదే మూడో సారి. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?[node:field_tags]A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
66 పరుగులకే ఆలౌట్.. పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025ను పాకిస్తాన్ ఓటమితో ఆరంభించింది. జోహోర్ బహ్రు వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 18.5 ఓవర్లలో కేవలం 66 పరుగులకే కుప్పకూలింది.పాక్ బ్యాటర్లలో కెప్టెన్ కోమాల్ ఖాన్(12), అయాజ్(15), ఆసిన్(10) డబుల్ ఫిగర్ మార్క్ అందుకోగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో అము సురేంకుమా 3 వికెట్లతో సత్తాచాటగా.. ఒలివా బ్రిన్స్డన్, ఓనీల్, కోల్మన్ తలా రెండు వికెట్లు సాధించారు.ఊదిపడేసిన ఇంగ్లండ్..అనంతరం 65 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 9.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కేటీ జోన్స్(20) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో మనహర్ జెబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆసిన్, ఫాతిమా ఖాన్ తలా వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం. జనవరి 18న ఐర్లాండ్‌తో జరగాల్సిన ఇంగ్లండ్ మొదటి మ్యాచ్ రద్దు అయింది. అదే విధంగా పాక్ మొదటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది.కాగా దక్షిణాఫ్రికా అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 22న అమెరికాతో తలపడనుంది. పాకిస్తాన్ కూడా అదే రోజున ఐర్లాండ్ మహిళలతో ఆడనుంది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీని అద్బుతమైన విజయంతో ఆరంభించింది.ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్ధి విండీస్ కేవలం 44 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 21న మలేషియాతో ఆడనుంది.చదవండి: Ranji Trophy: ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే? -
ఓడినా పర్వాలేదు.. ఛాంపియన్స్‌లా ఆడారు: ఇషాంత్ శర్మ
అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ఆరోసారి ముద్దాడాలన్న టీమిండియా కల నేరవేరలేదు. ఆదివారం బెన్నోని వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తాశారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు ఒత్తడిలో చిత్తయ్యారు. వరుసక్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతూ.. ఆసీస్‌కు నాలుగో సారి వరల్డ్‌కప్ టైటిల్‌ను అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(47), మురుగణ్ అభిషేక్(42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుకు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సపోర్ట్‌గా నిలిచాడు. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీ మొత్తం ఛాంపియన్స్‌లా ఆడిందని ఇషాంత్ కొనియాడాడు. "మన అండర్-19 జట్టు ఛాంపియన్స్‌లా ఆడింది. ఈ టోర్నమెంట్లో వారు పడిన కష్టాన్ని ఒక్క మ్యాచ్(ఫైనల్)తో పోల్చవద్దు. ఈ రోజు మనది కాదు. ఆటలో గెలుపుటములు సహజం. కానీ టోర్నమెంట్ అంతటా యువ ఆటగాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు, పోరాట పటిమని చూసి యావత్తు భారత్ గర్విస్తోంది. మీరు తల దించుకోండి బాయ్స్.. అంతకంటే బలంగా తిరిగి రండి" అంటూ ఇషాంత్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. -
ఫైనల్లో భారత్
కొలంబో: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అఫ్ఘానిస్తాన్‌తో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 77 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత భారత్ 49.1 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హిమాన్షు రాణా (123 బంతుల్లో 130; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడం విశేషం. 295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 217 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో కమలేశ్, యశ్, రాహుల్ చహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. -
భారత్ శుభారంభం
మలేసియాపై 235 పరుగుల ఆధిక్యంతో విజయం కొలంబో: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. మలేసియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో టీమిండియా 235 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (89; 12 ఫోర్లు, ఒక సిక్స్), అభిషేక్ శర్మ (59; 7 ఫోర్లు, ఒక సిక్స్), హీత్ జిగ్నేష్ పటేల్ (58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం మలేసియా 22.3 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కమలేశ్ నాగర్కోటి (4/12), యశ్ ఠాకూర్ (2/19), అభిషేక్ శర్మ (2/9) రాణించారు. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. -
సెమీస్‌కు చేరిన నిజామాబాద్ జట్టు
మహబూబ్‌నగర్ క్రీడలు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో నిజామాబాద్ జట్టు సెమీస్‌కు చేరింది. గురువారం జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో నిజామాబాద్ ఒక వికెట్ తేడాతో కరీంనగర్ జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ జట్టు 39.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిజామాబాద్ బౌలర్లలో శ్రావణ్, నిఖిల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నిజామాబాద్ జట్టు 31.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. జట్టులో కమలేష్ (27) ఒక్కడే రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆకాశ్‌రావు ఐదు, రాహుల్ 3 వికెట్లు తీసుకున్నారు. అయితే శనివారం నిర్వహించనున్న సెమీస్‌లో నిజామాబాద్ జట్టు వరంగల్‌తో తలపడనుంది.


