హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో నిజామాబాద్ జట్టు సెమీస్‌కు చేరింది. గురువారం జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో నిజామాబాద్ ఒక వికెట్ తేడాతో కరీంనగర్ జట్టును ఓడించింది.
సెమీస్‌కు చేరిన నిజామాబాద్ జట్టు
Sep 8 2016 11:30 PM | Updated on Sep 4 2017 12:41 PM
మహబూబ్‌నగర్ క్రీడలు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో నిజామాబాద్ జట్టు సెమీస్‌కు చేరింది. గురువారం జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో నిజామాబాద్ ఒక వికెట్ తేడాతో కరీంనగర్ జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ జట్టు 39.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిజామాబాద్ బౌలర్లలో శ్రావణ్, నిఖిల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నిజామాబాద్ జట్టు 31.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. జట్టులో కమలేష్ (27) ఒక్కడే రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆకాశ్‌రావు ఐదు, రాహుల్ 3 వికెట్లు తీసుకున్నారు. అయితే శనివారం నిర్వహించనున్న సెమీస్‌లో నిజామాబాద్ జట్టు వరంగల్‌తో తలపడనుంది.
Advertisement
Advertisement