సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ బ్యాట్‌తో రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో పర్వాలేదన్పిస్తున్న అర్జున్.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.
ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన అర్జున్ తన లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. గురువారం కోల్‌కతా వేదికగా బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ జూనియర్ టెండూల్కర్ బిహార్ పేసర్ సురాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
వైభవ్, గనీ మెరుపులు వృథా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్ గనీ(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు.
కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. గోవా బౌలర్లలో దీప్‌రాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అర్జున్ 2 వికెట్లు సాధించాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని గోవా కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్ సుయాష్ ప్రభుదేశాయ్(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కశ్యప్ బఖలే(64) హాఫ్ సెంచరీతో రాణించాడు.
చదవండి: ENG vs AUS: శతక్కొట్టిన జో రూట్.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర


