టీమిండియా వెటరన్ పేసర్, సౌరాష్ట్ర దిగ్గజం జయదేవ్ ఉనద్కట్ అరుదైన ఘనత సాధించాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉనద్కట్ అవతరించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ నితీశ్ కుమార్‌ను ఔట్ చేసిన జయదేవ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఇప్పటివరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 83 మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సిద్ధార్థ్ కౌల్(120) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కౌల్‌ను ఉనద్కట్ అధిగమించాడు.
పోరాడి ఓడిన సౌరాష్ట్ర
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌరాష్ట్రపై 10 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులకే పరిమితమైంది. రుచిత్ అహిర్(39), వగేలా(7 బంతుల్లో 23) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. ఢిల్లీ స్పిన్నర్ సుయష్ శర్మ 3 వికెట్లతో సత్తాచాటాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
జయదేవ్ ఉనద్కత్ 121
సిద్ధార్థ్ కౌల్ 120
పీయూష్ చావ్లా 113
లుక్మాన్ మేరివాలా 108
చామ మిలింద్ 107
ప్రస్తుతం టాప్-5 బౌలర్లలో జయదేవ్, చామ మిలింద్ మాత్రమే ఇంకా ఆడుతున్నారు. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఉనద్కట్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది.
చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్‌కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్‌కు ఛాన్స్?


