నవంబర్ 26 నుంచి ప్రారంభం కాబోయే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025-26) కోసం 17 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఎంపికయ్యాడు.
ఇవాళ ఉదయం నుంచి సోషల్‌మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) ఎంపికయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారిక ప్రకటనతో ఈ వార్త అబద్దం అని తేలిపోయింది.
అయితే సూర్యకుమార్ సాధారణ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో అతను కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. SMAT సౌతాఫ్రికా సిరీస్ షెడ్యూల్స్ క్లాష్ అవుతున్నాయి.
శార్దూల్ ఇటీవలే ముంబై రంజీ జట్టుకు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వెటరన్ అజింక్య రహానే నుంచి బాధ్యతలు చేపట్టాడు. వాస్తవానికి SMATలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉండింది. అయితే అతను ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడటంతో అందుబాటులో లేకుండా పోయాడు.
ఈ నేపథ్యంలో శార్దూల్‌కు కెప్టెన్సీ హోదా దక్కింది. రానున్న SMAT ఎడిషన్‌లో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. గత ఎడిషన్ ఫైనల్లో శ్రేయస్ నేతృత్వంలోని ముంబై జట్టు మధ్యప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
రానున్న సీజన్ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో చాలామంది టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్ శార్దూల్, భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు టీ20 స్టార్ శివమ్ దూబే, వెటరన్ అజింక్య రహానే, యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, అప్‌కమింగ్ స్టార్ ఆయుశ్ మాత్రే ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా అండర్-19 స్టార్ అంగ్‌క్రిష్ రఘువంశీ ఎంపికయ్యాడు.
ఈ టోర్నీలో ముంబై ప్రయాణం నవంబర్ 26న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుంది.
SMAT 2025-26 కోసం ముంబై జట్టు:
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, సాయిరాజ్ పాటిల్, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, తనుష్ కోటియన్, షమ్స్ ములానీ, తుషార్ దేశ్‌పాండే, ఇర్ఫాన్ ఉమైర్, హార్దిక్ తామోర్ (వికెట్‌కీపర్)
చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి


