సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పొట్టి క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని (429 మ్యాచ్‌ల్లో) తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన పదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అత్యంత లేటు వయసులో (41 ఏళ్ల 178 రోజులు) ఈ మార్కును తాకిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ రికార్డును (40 ఏళ్ల 315 రోజులు) బద్దలు కొట్టాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం ఈ ఘనత సాధించాడు.
పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
- క్రిస్ గేల్ – 14,562
- కీరన్ పోలార్డ్ – 14,462
- అలెక్స్ హేల్స్ – 14,449
- డేవిడ్ వార్నర్ – 13,836
- షోయబ్ మాలిక్ – 13,571
- జోస్ బట్లర్ – 13,554
- విరాట్ కోహ్లీ – 13,543
- జేమ్స్ విన్స్ – 12,854
- రోహిత్ శర్మ – 12,248
- ఫాఫ్ డుప్లెసిస్ – 12,002
పొట్టి క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
- ఫాఫ్ డుప్లెసిస్ – 12,002
- క్వింటన్ డి కాక్ – 11,813
- డేవిడ్ మిల్లర్ – 11,631
- రిల్లీ రొస్సో – 9,705
- ఏబీ డివిలియర్స్ – 9,424
మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ రాణించినా సూపర్ కింగ్స్‌పై ఎంఐ కేప్‌టౌన్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 44 పరుగులు చేసిన డుప్లెసిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేప్‌టౌన్ బౌలర్లలో కార్బిన్ బాష్ 3 వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ జట్టు 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూరన్ (33, 5 సిక్సర్లు), జేసన్ స్మిత్ (22, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి ఎంఐని గెలిపించారు. ఆదిలో డస్సెన్ (35) పర్వాలేదనిపించాడు. ఈ గెలుపుతో ఎంఐ సీజన్‌లో బోణీ కొట్టింది.


