తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు.
బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్లు ఇద్దరూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. జనవరి 14న తాను హీరోయిన్‌గా నటించిన అనగనగా ఒక రాజు విడుదలవుతోందని తెలిపింది.
ఐశ్వర్య రాజేశ్.. సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది.


