ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 7) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. ఉపఖండపు పరిస్థితుల దృష్ట్యా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పిన్ హెవీ టీమ్‌ను ఎంపిక చేసింది. జట్టులో నలుగురు స్పిన్నర్లకు (సాంట్నర్, బ్రేస్‌వెల్, ఫిలిప్స్, రచిన్) అవకాశం కల్పించింది.
ఆర్సీబీ స్టార్ బౌలర్, గతేడాది లీడింగ్ వికెట్ టేకర్ జేకబ్ డఫీ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కైల్ జేమీసన్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ పితృత్వ సెలవుల కారణంగా కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతారు. వీరిద్దరు గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఈ జట్టుకు ఎంపికైన మరో ముగ్గురు (ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, సాంట్నర్) కూడా గాయాల నుంచి కోలుకునే క్రమంలో ఉన్నారు. కాగా, ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ గ్రూప్-డిలో ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది.
దీనికి ముందు న్యూజిలాండ్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ల్లో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే వడోదరలో.. రెండో వన్డే రాజ్‌కోట్‌లో (జనవరి 14), మూడో వన్డే ఇండోర్‌లో (జనవరి 18) జరుగనున్నాయి.
అనంతరం జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్, రాయ్‌పూర్, గౌహతి, వైజాగ్, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో నలుగురిని మార్చి ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది.
టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు
- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్)
- ఫిన్ అలెన్
- మైఖేల్ బ్రేస్‌వెల్
- మార్క్ చాప్‌మన్
- డెవాన్ కాన్వే
- జేకబ్ డఫీ
- లాకీ ఫెర్గుసన్
- మ్యాట్ హెన్రీ
- డారిల్ మిచెల్
- ఆడమ్ మిల్నే
- జేమ్స్ నీషమ్
- గ్లెన్ ఫిలిప్స్
- చిన్ రవీంద్ర
- టిమ్ సీఫర్ట్
- ఇష్ సోధీ
ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జేమిసన్


