పాకిస్తాన్, న్యూజిలాండ్‌ ‘సూపర్‌–8’ మ్యాచ్‌ రద్దు | Pakistan vs New Zealand Super 8 match cancelled | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్, న్యూజిలాండ్‌ ‘సూపర్‌–8’ మ్యాచ్‌ రద్దు

Feb 22 2026 3:55 AM | Updated on Feb 22 2026 3:55 AM

Pakistan vs New Zealand Super 8 match cancelled

టి20 వరల్డ్‌ కప్‌ ‘సూపర్‌ ఎయిట్స్‌’ దశ పోటీలు వర్షం ప్రభావంతో మొదలయ్యాయి. గ్రూప్‌–2లో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మధ్య కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. టాస్‌ నెగ్గిన పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత సమయానికే మ్యాచ్‌ ఆరంభమవుతున్నట్లు కనిపించిన దశలో ఒక్కసారిగా వాన ముంచెత్తింది. స్వల్పంగా చినుకులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.

ప్రేమదాస స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా వాన తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. సూపర్‌–8లో పాక్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో... న్యూజిలాండ్‌ బుధవారం శ్రీలంకతో తలపడతాయి.  

నేటి సూపర్‌ – 8 మ్యాచ్‌లు
శ్రీలంక X ఇంగ్లండ్‌
వేదిక: పల్లెకెలె ;  మ.3.00 గంటల నుంచి  
భారత్‌ X దక్షిణాఫ్రికా
వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి గం. 7 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
 
Advertisement
Advertisement