బలూచ్ నుంచి మమ్మల్ని కాపాడండి: పాక్ సైన్యం గగ్గోలు | Pakistan Soldiers Cry In Baloch Custody | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌ సైనికుల్ని కిడ్నాప్‌ చేసిన బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ

Feb 20 2026 6:39 PM | Updated on Feb 20 2026 7:37 PM

Pakistan Soldiers Cry In Baloch Custody

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్‌ సైనికుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కిడ్మాప్‌ చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో పాక్‌ సైనికులు బీఎల్‌ఏ నుంచి తమని సురక్షితంగా కాపాడమని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఈ అంశం దాయాది దేశంలో చర్చకు దారి తీసింది. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో.. పలువురు పాక్ సైనికులు తమ సైనిక గుర్తింపు కార్డులను చూపిస్తూ.. ‘‘మమ్మల్ని రక్షించండి’’ అని కన్నీళ్లు పెట్టుకుని, పాక్ సర్కారును వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే,‘మీ సైనికుల్ని మేం కిడ్నాప్‌ చేశాం’ అంటూ బీఎల్‌ఏ విడుదల చేసిన వీడియోల్ని పాక్‌ సైన్యం ఖండించింది. మా సైనికులు సురక్షితంగా ఉన్నారు. మీరు మా సైనికుల్ని కిడ్నాప్‌ చేయలేదు’అని ఖండించింది.   

బలోచ్ లిబరేషన్‌ ఆర్మీ కిడ్నాప్‌ చేసిన ఎనిమిది మంది పాక్‌ సైనికుల కిడ్నాప్‌ అనంతరం పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు అల్టిమేటం జారీ చేసింది. పాక్‌ కిడ్నాప్‌ చేసిన బీఎల్‌ఏ ప్రతినిధుల్ని వారంలో విడుదల చేయాలని ఆదేశించింది. ఆ గడువు ముగిసేలోపు చర్యలు తీసుకోకపోతే తాము కిడ్నాప్‌ చేసిన సైనికులను హత మారుస్తామని హెచ్చరించింది.

అయితే,ఆ హెచ్చరికల్ని పాక్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు కిడ్నాప్‌ చేసింది మా సైనికుల్ని కాదని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం తీరుపై కిడ్నాప్‌కు గురైన పాక్‌ సైనికుల అసహనం వ్యక్తం చేశారు.బలోచ్‌ మమ్మల్ని కిడ్నాప్‌ చేసింది. అయినా మీరు  మమ్మల్ని పాక్‌ ఆర్మీకి చెందిన వారు కాదని ఎలా చెబుతారని పాక్‌ సైనికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బలోచ్‌ మీడియా ప్రతినిధి హక్కాల్ విడుదల చేసిన ఆ వీడియోలో ఆర్మీ దుస్తులు ధరించిన ఎనిమిది మంది ఆర్మీ సైనికులు ఉన్నారు.

ఆ వీడియోలో ఓ పాక్‌ ఆర్మీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాక్‌ ఆర్మీ ఐడీ కార్డు కెమెరాకు చూపిస్తూ .. ఇదిగో చూడండి. ఇది దేశ ఆర్మీ నాకు జారీ చేసింది. నా తండ్రి వికలాంగుడు. నేనే మా ఇంట్లో పెద్దవాడిని. మేము మీ సిబ్బంది కాదని చెప్పి అన్యాయం చేయోద్దు. మేం మీ సిబ్బంది కాదని మీరు చెప్పినట్లయితే.. మీరు నన్ను ఎందుకు నియమించారు? వీడియో నకిలీదని మీరు ఎందుకు చెబుతున్నారు?’అని ప్రశ్నించాడు. పాక్‌ సైనికులు ఇలా ప్రశ్నించడంతో షరీఫ్‌ ప్రభుత్వం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.  

పాక్‌ సైన్యం ఇచ్చిన వివరణపై బలోచ్‌ ప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సైనికులు సురక్షితంగా ఉంటే.. మేం ఎవరిని కిడ్నాప్‌ చేశాం?. వీడియోల్లో ఉన్నది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement