breaking news
Baloch leader
-
పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్
-
17 ఏళ్లుగా అతడు అదృశ్యం.. ఇప్పటికీ పోరాడుతున్న కుమార్తె
పారిస్: బలోచ్ నేషనల్ మూవ్మెంట్ (బీఎన్‌ఎమ్) సీనియర్ నేత డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ అదృశ్యమై 17 ఏళ్లు అవుతోంది. బలోచ్ స్వేచ్ఛ కోసం గొంతెత్తిన వారిని అదృశ్యం చేసి, వారి ఆచూకీని తెలియకుండా చేసే పాకిస్థాన్ చర్యలకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. తన తండ్రి ఆచూకీ తెలుసుకోవాలని, అదృశ్యమైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ 17 ఏళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నా, ఆమెకూ బెదిరింపులు ఎదురవుతున్నాయని బలోచ్ నేషనల్ మూవ్మెంట్ ఆరోపిస్తోంది.ముహమ్మద్ బలోచ్ అదృశ్యానికి 17 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీఎన్‌ఎమ్ అధ్యక్షుడు డాక్టర్ నసీమ్ బలోచ్ స్పందించారు. బలోచిస్థాన్‌లో అదృశ్యమైన వారు పడుతున్న బాధలకు ఈ ఘటన ఇప్పటికీ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.ఎక్స్‌లో డాక్టర్ నసీమ్ బలోచ్ దీనిపై మాట్లాడుతూ.. "ఇన్నేళ్లుగా ఓ వ్యక్తి అదృశ్యమైతే ఏ కుటుంబమైనా భరించలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆయన కుటుంబ సభ్యులు అనిశ్చితి, వేదన మధ్య జీవిస్తున్నారు. ఆయనకు ఏమైందో తెలుసుకునే కనీస హక్కు కూడా వారికి దక్కలేదు" అని అన్నారు.డాక్టర్ దీన్ ముహమ్మద్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్‌ను నసీమ్ బలోచ్ ప్రస్తావిస్తూ.. "తన తండ్రితో పాటు.. అదృశ్యమైన వారిని తిరిగి తీసుకురావాలన్న శాంతియుత పోరాటానికి ఆమె ధైర్యంగా అంకితమైంది. న్యాయం దక్కాల్సిన చోట కూడా ఆమె బెదిరింపులను ఎదుర్కొంటోంది. ఆమె మానవ హక్కుల పోరాటాన్ని, తన తండ్రి తిరిగి రావాలన్న ఉద్యమాన్ని విడిచిపెట్టేలా బెదిరింపులు, భయపెట్టే చర్యలు ఎదుర్కొంటోంది" అని ఆరోపించారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిదర్శనమని ఆరోపించారు. ఇది కఠిన వాస్తవాన్ని బయటపెడుతోందని, పాకిస్థాన్‌లో ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారికి మానవ హక్కులు, న్యాయం లేకుండా చేస్తున్నారని తెలిపారు. అదృశ్యమైన కుటుంబ సభ్యుడి గురించి సమాచారం అడగడాన్నే నేరంగా చూస్తున్నారని, మానవ హక్కుల పరిరక్షకులను గొంతెత్తినందుకు బెదిరిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ పాలనలో తమ బలోచ్ ప్రజలు మౌలిక హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను సాధించలేరని బీఎన్‌ఎమ్ నమ్ముతోందని అన్నారు. "చివరకు సత్యం, న్యాయమే గెలుస్తాయని మేము నమ్ముతున్నాం. మా లక్ష్యాలు నెరవేరే వరకు మా శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తాం" అని తెలిపారు.పోరాటంలో వెనక్కితగ్గని కుమార్తె డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ బలోచిస్థాన్‌లో అదృశ్యాలపై గళమెత్తుతున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త. ఆమె తండ్రి 2009లో అదృశ్యమైనప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం నిరంతరం పోరాడుతోంది.ఆమె బలోచ్ యక్జెహ్తీ కమిటీలో కీలక నాయకురాలిగా, వాయిస్ ఫర్ బలోచ్ మిస్సింగ్ పర్సన్స్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2014లో క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వరకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, తన తండ్రితో పాటు అదృశ్యమైన బలోచ్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.బలోచిస్థాన్‌లో బలవంతపు అదృశ్యాలు, న్యాయ విచారణ లేకుండా జరిగే హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై కూడా ఆమె స్వరం వినిపిస్తోంది. మానవ హక్కుల పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు 2024లో ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అవార్డు లభించింది.ఆందోళన కార్యక్రమాల సందర్భంగా ఆమెను పలుసార్లు పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు, విదేశీ ప్రయాణాన్ని కూడా అడ్డుకున్నట్లు మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. తండ్రి ఆచూకీ కోసం మొదలైన ఆమె పోరాటం, ఇప్పుడు బలోచిస్థాన్‌లో అదృశ్యమైన వేలాది మంది కుటుంబాల తరఫున న్యాయం కోరే ఉద్యమంగా మారింది. -
బలూచ్ నుంచి మమ్మల్ని కాపాడండి: పాక్ సైన్యం గగ్గోలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ సైనికుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కిడ్మాప్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో పాక్ సైనికులు బీఎల్ఏ నుంచి తమని సురక్షితంగా కాపాడమని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అంశం దాయాది దేశంలో చర్చకు దారి తీసింది. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో.. పలువురు పాక్ సైనికులు తమ సైనిక గుర్తింపు కార్డులను చూపిస్తూ.. ‘‘మమ్మల్ని రక్షించండి’’ అని కన్నీళ్లు పెట్టుకుని, పాక్ సర్కారును వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే,‘మీ సైనికుల్ని మేం కిడ్నాప్ చేశాం’ అంటూ బీఎల్ఏ విడుదల చేసిన వీడియోల్ని పాక్ సైన్యం ఖండించింది. మా సైనికులు సురక్షితంగా ఉన్నారు. మీరు మా సైనికుల్ని కిడ్నాప్ చేయలేదు’అని ఖండించింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసిన ఎనిమిది మంది పాక్ సైనికుల కిడ్నాప్ అనంతరం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు అల్టిమేటం జారీ చేసింది. పాక్ కిడ్నాప్ చేసిన బీఎల్ఏ ప్రతినిధుల్ని వారంలో విడుదల చేయాలని ఆదేశించింది. ఆ గడువు ముగిసేలోపు చర్యలు తీసుకోకపోతే తాము కిడ్నాప్ చేసిన సైనికులను హత మారుస్తామని హెచ్చరించింది.అయితే,ఆ హెచ్చరికల్ని పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు కిడ్నాప్ చేసింది మా సైనికుల్ని కాదని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం తీరుపై కిడ్నాప్‌కు గురైన పాక్ సైనికుల అసహనం వ్యక్తం చేశారు.బలోచ్ మమ్మల్ని కిడ్నాప్ చేసింది. అయినా మీరు మమ్మల్ని పాక్ ఆర్మీకి చెందిన వారు కాదని ఎలా చెబుతారని పాక్ సైనికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బలోచ్ మీడియా ప్రతినిధి హక్కాల్ విడుదల చేసిన ఆ వీడియోలో ఆర్మీ దుస్తులు ధరించిన ఎనిమిది మంది ఆర్మీ సైనికులు ఉన్నారు.ఆ వీడియోలో ఓ పాక్ ఆర్మీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాక్ ఆర్మీ ఐడీ కార్డు కెమెరాకు చూపిస్తూ .. ఇదిగో చూడండి. ఇది దేశ ఆర్మీ నాకు జారీ చేసింది. నా తండ్రి వికలాంగుడు. నేనే మా ఇంట్లో పెద్దవాడిని. మేము మీ సిబ్బంది కాదని చెప్పి అన్యాయం చేయోద్దు. మేం మీ సిబ్బంది కాదని మీరు చెప్పినట్లయితే.. మీరు నన్ను ఎందుకు నియమించారు? వీడియో నకిలీదని మీరు ఎందుకు చెబుతున్నారు?’అని ప్రశ్నించాడు. పాక్ సైనికులు ఇలా ప్రశ్నించడంతో షరీఫ్ ప్రభుత్వం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం ఇచ్చిన వివరణపై బలోచ్ ప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సైనికులు సురక్షితంగా ఉంటే.. మేం ఎవరిని కిడ్నాప్ చేశాం?. వీడియోల్లో ఉన్నది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. The Pakistan Army generals save themselves and leave their soldiers behind to di€.. pic.twitter.com/Oe9y1OXSgQ— THE UNKNOWN MAN (@Theunk5555) February 20, 2026 -
‘పాకిస్తాన్ ఉగ్ర దేశమే.. ఆ సైన్యం 40 మసీదులను కూల్చేసింది’
జమ్మూ–కాశ్మీర్‌లోని మసీదులను భారత్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆరోపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. పాకిస్తాన్ సైన్యమే మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఆరోపించారు.పాకిస్తాన్‌ను ఆయన బహిరంగంగా ‘ఉగ్రవాద దేశం’గా పేర్కొనడం గమనార్హం. భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే నైతిక హక్కు పాకిస్తాన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్లో మసీదులు, ఇమాములు, కమిటీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ప్రతిస్పందనగానే ఈ వ్యాఖ్యలు చేశారు.బలూచిస్తాన్‌లో 40 మసీదుల ధ్వంసంబలూచ్ జాతీయవాద నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త అయిన మీర్ యార్ బలూచ్ ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం ఇప్పటివరకు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సుమారు 40 మసీదులను ధ్వంసం చేసింది. ఇందులో మసీదులపై నేరుగా బాంబు దాడులు చేయడం, పవిత్ర ఖురాన్‌ను దహనం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.భారత్‌కు బలూచిస్తాన్ మద్దతుజమ్మూ–కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకుంటున్న సూత్రప్రాయ వైఖరికి బలూచిస్తాన్ రిపబ్లిక్ పూర్తి మద్దతు ఇస్తోందని మీర్ యార్ పేర్కొన్నారు. మత, జిహాదీ తీవ్రవాద శక్తులను ఉపయోగించి హిందువులు సహా మైనారిటీలను అణచివేస్తున్న పాకిస్తాన్, ఇతర దేశాలకు మానవ హక్కులపై పాఠాలు చెప్పడం విడ్డూరమని ఆయన విమర్శించారు.పాకిస్తాన్‌కు చెందిన “బాహ్య శక్తులు” బలూచిస్తాన్‌లో మసీదులపై బాంబు దాడులు చేయడం, ఖురాన్ దహనం చేయడం, మసీదుల అధిపతులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.పాకిస్తాన్ ఆక్రమణ సైన్యం ట్యాంకులతో దాడులు జరిపి పౌరులపై షెల్స్, ఫిరంగులు ప్రయోగించినప్పుడు తొలి బలైంది ఖాన్ ఆఫ్ కలత్ మసీదు అని మీర్ యార్ బలూచ్ తెలిపారు. ఆ మసీదులో ఇప్పటికీ మోర్టార్ షెల్స్ మోగిన శబ్దాలు వినిపిస్తాయని, అది పాకిస్తాన్ క్రూరత్వానికి నిదర్శనమని అన్నారు.మైనారిటీలపై దౌర్జన్యాలుహిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా అనేక మైనారిటీ వర్గాలు పాకిస్తాన్లో నిరంతర హింసకు గురవుతున్నాయన్న విషయం ప్రపంచానికి తెలిసిందేనని మీర్ యార్ బలూచ్ వ్యాఖ్యానించారు. అటువంటి దేశానికి భారత్, బలూచిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్లకు మానవ హక్కులపై ఉపన్యాసాలు ఇచ్చే నైతిక అర్హత లేదని ఆయన తేల్చిచెప్పారు. -
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. బీఎల్ఏ దాడిలో సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీకి మరో బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీ బస్సుపై బలోచ్ లిబరేషన్ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక, బలోచ్ లిబరేషన్(బీఎల్ఏ).. గత ఆరు నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని హతమార్చడం గమనార్హం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీపై మరోసారి బీఎల్ఏ దాడులపర్వం కొనసాగుతోంది. తాజాగా క్వెట్టా, కలాట్, జహు ప్రాంతాల్లో తాము దాడి చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాక్ ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడీ బాంబులతో దాడి చేసింది. దాడి సమయంలో పాక్ సైనికులు సహా 48 మంది బస్సులో ప్రయాణిస్తున్నారని ప్రకటించింది. దాడి సందర్భంగా 29 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు బీఎల్ఏ పేర్కొంది. పదులు సంఖ్యలో సైనికులు గాయపడినట్టు బీఎల్ఏ తెలిపింది. అయితే, ఆరు నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని బీఎల్ఏ హత మార్చింది. According to a statement by the #Baloch Liberation Army (#BLA), 29 #PakistanArmy personnel were killed in two coordinated attacks in #Balochistan - one near #Quetta and another near #Kalat. pic.twitter.com/VwjzDIMb9s— IDU (@defencealerts) July 17, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేర్వేరు ఆపరేషన్లలో పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే దాడులు చేస్తోంది. #IndiaTodayExclusive: The Baloch Liberation Army (BLA) has launched one of its deadliest offensives yet, killing 29 in a bus attack targeting Pakistani soldiers in Quetta and Kalat. This marks the highest death toll for Pakistan’s forces in six months.In the first half of 2025… pic.twitter.com/tLyLhXHBKM— India Today Global (@ITGGlobal) July 17, 2025 -
'భారత్ ఏం చేసినా కరెక్టే.. మేం మద్దతిస్తాం'
-
'భారత్ ఏం చేసినా కరెక్టే.. మేం మద్దతిస్తాం'
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏం చేసినా న్యాయమేనని బెలూచిస్తాన్ మద్దతుదారులు అన్నారు. ఉగ్రవాదాన్ని ఏరి పారేసేందుకు భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతిస్తామని చెప్పారు. భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై 'నిర్దేశిత దాడులు' (సర్జికల్ స్ట్రైక్స్) చేసింది. పాక్ భూభాగంలోనే తాము ఈ దాడులు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ నేరుగా ప్రకటించారు కూడా. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేసిన ఈ దాడులను ఇప్పటికే అంతర్జాతయ సమాజం మద్దతిస్తున్న నేపథ్యంలో తాజాగా బెలూచిస్తాన్ మద్దతుదారులు భారత్ వైపు మరోసారి తమ గొంతు వినిపించారు. గురువారం మధ్యాహ్నం కొంతమంది బెలూచిస్తాన్ మద్దతుదారులు మజ్దాక్ దిల్సాద్ బాలోచ్ అనే నాయకుడి ఆధ్వర్యంలో పాక్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఏం చేసినా సరైనదేనని, తాము ఇలాంటి దాడులకు మద్దతిస్తామని, ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో కూడా భారత్ నిర్వహించాలని కోరారు.


