టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం? | Speaker Om Birla Likely To Decide On TMC And Shiv Sena Merger Pleas Ahead Of Parliament Monsoon Session, More Details Inside | Sakshi
Sakshi News home page

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?

Jul 4 2026 10:28 AM | Updated on Jul 4 2026 10:43 AM

Speaker decide on TMC Sena UBT merger disputes before monsoon session

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయంగా కలకలం రేపుతున్న రెండు విలీన వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనం కావాలని కోరుతూ 20 మంది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తిరుగుబాటు ఎంపీలు, అలాగే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పక్షంలో విలీనం కావడానికి అనుమతించాలని కోరుతూ ఆరుగురు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీలు స్పీకర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ రెండు అంశాలకు సంబంధించిన చట్టపరమైన, సాంకేతిక అంశాలను స్పీకర్ ఓం బిర్లా నిశితంగా పరిశీలిస్తున్నట్లు లోక్‌సభ ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హతలను పరిశీలించి తుది నిర్ణయానికి రానున్నారు. ఈ వ్యవహారంలో గతంలో జరిగిన పరిణామాలను అధ్యయనం చేయడంతో పాటు, అవసరమైతే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి చట్టపరమైన సలహాలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement