గాయత్రీ మంత్రం-కల్మా కలయికతో కూడిన కళాఖండం..! నటి సోనాక్షి.. | Sonakshi Sinha shares meaningful wedding gift artwork symbolizing | Sakshi
Sakshi News home page

గాయత్రీ మంత్రం-కల్మా కలయికతో కూడిన కళాఖండం..! నటి సోనాక్షి..

Jul 4 2026 12:19 PM | Updated on Jul 4 2026 1:08 PM

Sonakshi Sinha shares meaningful wedding gift artwork symbolizing

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా తన భర్త జహీర్‌ ఇక్బాల్‌తో నివసిస్తున్న ఇంట్లో ఉన్న ఒక అర్థవంతమైన కళాఖండాన్ని అభిమానులకు పరిచయం చేశారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది ఆ అద్భుత కళాఖండం. దీని గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో దబాంగ్‌ నటి సోక్షి ఇలా రాసుకొచ్చారు. 

ఆ పెయింటింగ్‌ వెనుక ఉన్న భావనను గురించి వివరించారామె. ఇది గాయత్రీ మంత్రం కల్మాలను ఏకం చేసే కళాఖండంగా పేర్కొన్నారు. అలాగే దీని భావననను స్ఫురించేలా తన వివాహ సయంలో జరిగిన ఒక అద్భుతాన్ని కూడా పంచుకుంది. సోనాక్షి తన పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..ఆవేళ పురోహితులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుండగా.. అజాన్ (ప్రార్థన పిలుపు) శబ్దం వినిపించింది. ఈ రోజు ఆ రెండు ప్రార్థనల శక్తి నడుమే తమ పెళ్లి తంతు జరిగిందని. దాన్ని గుర్తుచేసేలా రెండు ప్రార్థనల శక్తితో కూడిన ఈ పెయింటింగ్‌ తమ ఇంటిని సంతోషకరమైన నిలయంగా మార్చిందని చెప్పుకొచ్చింది. 

ఎవరు బహుకరించారంటే..
ఈ కళాఖండం తన స్నేహితురాలు శుభికా శర్మ ఇచ్చిన ఆశ్చర్యకరమైన వివాహ బహుమతి అని కూడా ఆమె వెల్లడించారు. తకు ఏది అర్థవంతమైనదిగా ఉంటుందో ఆలోచించి మరి ఆమె ఈ బహుమతి ఇచ్చినట్లు తెలిపింది. తాము ఆస్ట్రేలియా విహారయాత్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఫోన్‌ చేసి తమ వివాహం కోస ఒక పెయింటింగ్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. 

అయితే ఆ పెయింట్‌ బహుమతి గురించి వివరించినప్పుడు..తమ ఇద్దరి హృదయాల్లోని భావనల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనగా అనిపించిందని చెప్పుకొచ్చొంది. అలాగే తన స్నేహితురాలు శుభికా..మా ఇద్దిరి విశ్వాసాలు, ప్రేమ, సానుకూలతతో కూడిన సామరస్యంగా ఎలా మారాయో ప్రతిబింబించేలా ఉండాలనే ఈ బహుమతి బహుకరించినట్లు తెలిపారామె. 

ఎవరు చిత్రించారంటే..
శుభికా తనను కళాకారుడు ఆదిలా బేదీకి పరిచయం చేశారని సోనాక్షి తెలిపారు. ఆదిలా ఆ జంట భావోద్వేగాలను అర్థం చేసుకుని, వాటిని కాన్వాస్‌పై అద్భుతంగా చిత్రించారు. ఆ కళాకారుడు తమ ఇంటికి వచ్చి.. మా ఆలోచనలు, భావనలను అర్థం చేసుకుని, వాటిని కాన్వాస్‌పై ఎంతో అందంగా చిత్రించారు. బహుశా ఇది దైవిక సంకల్పం అనుకోవాలేమో ..!. తాము లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్నామని తెలియకుడానే తమను సంప్రదించి.. ఈ పెయింటింగ్‌ పూర్తియ్యిందని చెప్పారు. 

ఈ పెయింటింగ్‌ తనకు, జహీర్‌కు ఎంత ముఖ్యమైందో వివరిస్తూ..ఇది తమ ఇంటిని అత్యంత అర్థవంతమైన రీతిలో పరిపూర్ణం చేసిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది సోనాక్షి. కాగా, జూన్‌2024లో వివాహం చేసుకున్న ఈ జంట తరుచుగా ఒకరి నమ్మకాలను మరొకరు ప్రేమ, గౌరవంతో స్వీకరించడం గురించి మాట్లాడుతుంటారు. ఈ  పోస్ట్‌ ఐక్యత, విశ్వాసం, ప్రేమ వంటి అన్యోన్యత విలువలకు నిలువుటద్దం.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement