ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా?
బెలూమ్ గుహలు (Belum Caves)
ఈ గుహ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు.
ఇప్పుడు కనుమరుగైన చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో సహజంగా ఏర్పడిన గుహలు ఇవి.
ఈ గుహల్లో ప్రచీన కాలంలో జైన, బౌద్ధ భిక్షువులు నివసించేవారనడానికి ఆధారాలున్నాయి.
ఇక్కడ లభ్యమైన బౌద్ధమత అవశేషాలను అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు.
బెలూం గుహలు కర్నూలుకు 109 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 336 కిలోమీటర్లు, దూరంలో ఉన్నాయి.


